ఆంధ్ర ప్రదేశ్ వైద్య ఆరోగ్యశాఖ రంగంలో ఉద్యోగ కల్పనలో పెద్దపీట వేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి

 పశ్చిమ గోదావరి జిల్లా.. ఏలూరు (ప్రజా అమరావతి);




ఆంధ్ర ప్రదేశ్ వైద్య ఆరోగ్యశాఖ రంగంలో ఉద్యోగ కల్పనలో పెద్దపీట వేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి


గారు అని పేర్కొన్న రాష్ట్ర ఉపముఖ్యమంత్రి వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని..

ప్రజల కోసం ఏలూరు ఉపముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక గ్యాలరీని ఏర్పాటు చేసి ప్రజలు తనను కలుసుకునే విధంగా కాకుండా తానే ప్రజల వద్దకు వెళ్లి ప్రజలు కష్టసుఖాలను తెలుసుకొని వారి వినతులను స్వీకరించి అక్కడికక్కడే అధికారులతో మాట్లాడి ప్రజా సమస్యలను పరిష్కరిస్తున్న మంత్రి ఆళ్ల నాని గారిది ప్రత్యేక శైలి..ఏలూరు ఉపముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో గురువారం కరోనా జాగ్రత్తలు పాటిస్తూ  వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన నిరుద్యోగ యువత దగ్గర నుండి ఉద్యోగ అప్లికేషన్ లో మంత్రి ఆళ్ల నాని స్వీకరించారు..  

రాష్ట్ర ప్రభుత్వం పేదలను ఆదుకోవాలని దృఢ సంకల్పంతో చదువుకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి నాణ్యమైన విద్యతో పాటు ఉద్యోగాలు కూడ వచ్చే విధంగా అన్ని చర్యలు తీసుకుంటుందని మంత్రి ఆళ్ల నాని తెలిపారు...

 జగనన్న విద్యా దీవెన ద్వారా లబ్ది పొందుతున్న విద్యార్థుల్లో అప్షన్స్ గా ఎంపిక చేసుకున్న వారికి ఒక లక్ష 10వేల 779ల్యాబ్ టాబ్స్ రాష్ట్ర వ్యాప్తంగా అందచేస్తుందని మంత్రి ఆళ్ల నాని పేర్కొన్నారు..ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఒక నైపుణ్యభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు మంత్రి ఆళ్ల నాని చేప్పారు...

ఉద్యోగాలని పారదర్శకంగా, మిరిట్ బేస్ మీద నియామకం జరుగుతుందని మంత్రి ఆళ్ల నాని తెలియజేశారు..ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు గ్రామ సచివాలయాలు గ్రామ సాధ్యమే లక్ష్యంగా, సచివాలయం వార్డు, వాలంటీర్లను నియమించడం జరిగిందని మంత్రి ఆళ్ల నాని చెప్పారు..సామాన్యుడు దగ్గర నుండి ఎవరు ఏ స్థాయిలో ఉన్న నేరుగా మంత్రి ఆళ్ల నానిని కలిసి తమ సమస్యలు చేప్పుకునే వెసులుబాటు ప్రతీ ఒక్కరిది..

రాష్ట్ర ప్రజల సంక్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయమని, దీని కోసం ఎన్నో సంక్షేమ, అభివృద్ధి పథకాలు అమలు చేస్తున్నామని అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి ఆళ్ల నాని సూచించారు..ఈ కార్యక్రమంలో ఏలూరు నగర మేయర్ శ్రీమతి నూర్జహాన్ పెద్దబాబు, ఏలూరు నగర డిప్యూటీ మేయర్ గుడిదేశి శ్రీనివాసరావు, నూక పెయ్యి సుధీర్ బాబు, ఏఎంసీ చైర్మన్ మంచం మై బాబు,నగర అధ్యక్షులు బొద్దని శ్రీనివాస్, నగర కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు మున్నుల జాన్ గురునాథ్, వైఎస్సార్సీపీ నాయకులు నేరుసు చిరంజీవి, కిలాడి దుర్గారావు, బండారు కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు..


Comments