సీఎం వైఎస్‌ జగన్‌ గారు బీసీలు అంటే బ్యాక్ వార్డ్ క్యాస్ట్ కాదు బ్యాక్ బోన్ క్యాస్ట్‌గా నిలిపారని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు..

 పశ్చిమగోదావరి జిల్లా... ఏలూరు..(ప్రజా అమరావతి);
 సీఎం వైఎస్‌ జగన్‌ గారు బీసీలు అంటే బ్యాక్ వార్డ్ క్యాస్ట్ కాదు బ్యాక్ బోన్ క్యాస్ట్‌గా నిలిపారని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు.. 56 కార్పొరేషన్లలో 29 కార్పొరేషన్లకు మహిళలను చైర్మన్లుగా నియమించడంతో పాటు, 50% డైరెక్టర్‌ పదవులను మహిళలకు కేటాయించడం జరిగిందని మంత్రి ఆళ్ల నాని అన్నారు..
ఏలూరు ఉపముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గంలో ఉన్న పద్మశాలిలు, సంఘ సభ్యులు మంత్రి ఆళ్ల నాని మర్యాదపూర్వకంగా కలిశారు.. ఏలూరు నియోజకవర్గంలో నివసిస్తున్న పద్మశాలీలు ఎన్నో ఏళ్లుగా వారు ఎదుర్కొంటున్న సమస్యలను గత ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో వారు నగరంలో శుభ కార్యాలు గాని, చిన్న కార్యక్రమం గాని జరుపుకోవడానికి సరైన సదుపాయాలు లేకపోవడంతో వారు ఆ సమస్యను మంత్రి ఆళ్ల నాని దృష్టికి తీసుకువచ్చారు.. పద్మశాలీలు ఏదైనా శుభకార్యం గాని, ఫంక్షన్ గాని నిర్వహించాలంటే ఆర్థిక స్తోమత సరిపోక పోవటంతో ఇప్పటి వరకు వారికి సరైన కమ్యూనిటీ హాల్  లేనందున ఉపముఖ్యమంత్రి వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని వారు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించారు.. అనునిత్యం ప్రజల పక్షాన నిలబడుతూ తన నియోజకవర్గ ప్రజల ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ఎప్పటికప్పుడు ముందు ఉంటూ పద్మశాలిలకు 10 లక్షల రూపాయలు నిధులను కేటాయించడమే కాకుండా వారి కుటుంబ శుభకార్యాలకు, ఫంక్షన్లకు కమ్యూనిటీ హాల్ కు స్థలాన్ని కేటాయించడంతో ఏలూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి పద్మశాలీలు అందరూ మంత్రి ఆళ్ల నాని ని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందజేసి, కృతజ్ఞతలు, ధన్యవాదములు తెలిపినారు.. ఈ సందర్భంగా మంత్రి ఆళ్ల నాని మాట్లాడుతూ బీసీలను రాజకీయంగా, ఆర్ధికంగా, సామాజికంగా బలోపేతం చేసేందుకు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి బీసీల పక్షపాతిగా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు నిలిచారని కొనియాడారు..139 బీసీ కులాలకు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి, చైర్మన్‌లు, డైరెక్టర్‌లను నియమించి సరికొత్త నాయకత్వానికి శ్రీకారం చుట్టారని మంత్రి ఆళ్ల నాని ప్రశంసించారు.. దేశ చరిత్రలో ఎన్నడూ ఇంతమంది బీసీలకు అధికారమిచ్చిన దాఖలాలు లేవని,మహిళలకు పెద్దపీట వేస్తూ బీసీలు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ముందడుగు వేసేందుకు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ సమాన అవకాశం కల్పిస్తూ,వెనుకబడిన వర్గాలకు అధిక ప్రాధాన్యమిస్తున్న సీఎం జగన్‌ గారు చరిత్రలో నిలిచిపోతారని మంత్రి ఆళ్ల నాని పేర్కొన్నారు..బీసీల కోసం చంద్రబాబు ఐదేళ్లలో రూ.16 వేల కోట్లు ఖర్చు చేస్తే వైఎస్‌ జగన్‌ గారు ఏడాదిన్నర కాలంలోనే రూ.67 వేల కోట్లు అందించారని మంత్రి ఆళ్ల నాని చెప్పారు.. నూతన బీసీ నాయకత్వం కోసమే బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేశారని,పార్టీ పటిష్టతకు కృషి చేస్తూ బలమైన నాయకులుగా ఎదగాలని మంత్రి ఆళ్ల నాని కోరారు..బలహీనవర్గాల అభ్యున్నతి కోసం సీఎం వైఎస్‌ జగన్‌ గారు అహర్నిశలు కృషి చేస్తున్నారని మంత్రి ఆళ్ల నాని చెప్పారు.. ఇచ్చిన హామీలు నెరవేర్చిన ఘనత సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గారికే దక్కుతుందని పేర్కొన్నారు.. మంత్రి క్యాబినెట్‌లో బీసీలకు పెద్ద పీట వేశారని తెలిపారు,బీసీలకు గుర్తింపు గౌరవం ఇచ్చే బీసీల అభివృద్ధికి పాటుపడిన నాయకుడు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారని మంత్రి ఆళ్ల నాని చెప్పారు..

ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మంచేం మై బాబు, డిప్యూటీ మేయర్ లు నూకపేయి సుధీర్ బాబు, గుడిదేశి శ్రీనివాస్, బీసీ నాయకులు కిలాడి దుర్గారావు,  నేరుసు చిరంజీవులు, నాగబాబు, చేనేత సొసైటీ చైర్మన్ కొల్లిపాక సురేష్ బాబు, ఎన్టీఆర్ కాలనీ కుల పెద్దలు మరియు రామకృష్ణాపురం కుల పెద్దలు, గొల్లగూడెం కుల పెద్దలు, నరసరావుపేట కుల పెద్దలు, కొత్తూరు ఇందిరమ్మ కాలనీ సాయి నగర్ కొబ్బరి తోట, పోస్టల్ కాలనీ కుల పెద్దలు తదితరులు పాల్గొన్నారు..