గ్రామ, మండల కమిటీలు రద్దు వసంత కృష్ణ ప్రసాదు

 గ్రామ, మండల కమిటీలు రద్దు


వసంత కృష్ణ ప్రసాదు 


మైలవరం (ప్రజా అమరావతి);

మైలవరం నియోజకవర్గ పరిధిలో ఇప్పటివరకు ఉన్న గ్రామ, మండల ఇతర అన్ని కమిటీలను పార్టీ నిర్ణయం మేరకు రద్ద చేయడం జరిగిందని త్వరలోనే నూతన కమిటీల నియామకం చేపట్టడం జరుగుతుందని శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాదు గారు తెలిపారు.

శనివారం నాడు మైలవరం లో ఏర్పాటుచేసిన విలేకరుల  సమావేశం లో ఎమ్మెల్యే కృష్ణ ప్రసాదు గారు మాట్లాడుతూ.....

ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఇప్పటి వరకు పార్టీ పదవులు నిర్వహిస్తున్న నాయకుల్లో కోందరు ప్రజా ప్రతినిధులుగా ఎన్నిక కాగా, మరి కోందరు నామినేటెడ్ పదవుల్లో ఉన్నారు.

పార్టీలో ఉన్న నాయకులందరికి సముచిత స్దానం కల్పించాలనే లక్ష్యంతో ప్రస్తుతం ఉన్న కమిటీలను రద్ద చేయడం జరిగిందని త్వరలోనే నూతన కమిటీలను ఏర్పాటుచేయడం జరుగుతుందని తెలిపారు.