ఆలయం లేని ప్రాంతంలో కొత్తగా ఆలయం నిర్మాణానికి కసరత్తు....

 పశ్చిమగోదావరి జిల్లా... ఏలూరు.(ప్రజా అమరావతి);.


రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నానితో ఏపి దేవాదాయ ధర్మదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వాణిమోహన్ భేటీ...


ఏపిలో ఆలయాలు అభివృద్ధికి ప్రణాళిక...


ఆలయం లేని ప్రాంతంలో కొత్తగా ఆలయం నిర్మాణానికి కసరత్తు....



అన్ని ఆలయాల్లో భక్తులకు మెరుగైన సేవలు అందించడానికి ప్రత్యేక ద్రుష్టి...


-----------------రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని...



ఆంధ్రప్రదేశ్ లో పెద్ద ఎత్తున ఆలయాలు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుందని,

ఇప్పటివరకు ఆలయం లేని చోట్ల కొత్తగా ఆలయం నిర్మాణానికి ప్రాధాన్యత ఇచ్చి నిధులు విడుదల చేయడానికి దేవాదాయ శాఖ ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని చేప్పారు...


రాష్ట్ర వ్యాప్తంగా అన్ని హిందూ ఆలయాల్లో పూర్తి పారదర్శిక విధానాలను అమలులోకి తెచ్చెందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా చర్యలు చేపట్టినట్టు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు...


ఆలయాల్లో దేవుడు నగలు, ఆలయ భూములు, లీజ్ లు వివరాలు ఆలయాలకు ప్రతి ఏడాది ఏ రూపంలో ఆదాయం వస్తుంది, ఎంత ఖర్చు అవుతుంది, బ్యాంకు డిపాజిట్లు ఏ మేరకు ఉన్నాయో వివరాలు ఆలయాలు వారిగా నిర్వహించే 6రకాల రిజిస్టర్లు కూడ కంప్యూటీకరణ చేయాలని ప్రభుత్వం బావిస్తున్నట్టు మంత్రి ఆళ్ల నాని చేప్పారు..


పశ్చిమగోదావరి జిల్లా ద్వారకాతిరుమల దేవస్థానంలో జరుగుతున్న కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఏపి దేవాదాయ, ధర్మదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వాణిమోహన్ గురువారం ఏలూరులోని ఉప ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నానిని మర్యాద పూర్వకంగా కలిసి పుష్ప గుచ్చంతో దుశాలువాతో ఘనంగా సత్కరించారు...


అనంతరం మంత్రి ఆళ్ల నాని దేవాలయాలు అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలపై ప్రిన్సిపల్ సెక్రటరీ వాణి మోహన్ తో చర్చించారు...


ఈ సందర్బంగా మంత్రి ఆళ్ల నాని మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో అన్ని ఆలయాల్లో భక్తులకు మెరుగైన సేవలు అందించడానికి చర్యలు తీసుకోవాలని మంత్రి ఆళ్ల నాని వాణి మోహన్ కు సూచించారు...


పుణ్య క్షేత్రాల్లో పారిశుధ్యంపైన కూడ ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాలాని, భక్తులకు ప్రత్యక్ష సేవలతో పాటు ఆన్లైన్, పరోక్ష సేవలు ద్వారా దగ్గర అయ్యిందుకు చర్యలు చేపట్టాలని మంత్రి ఆళ్ల నాని సూచించారు...


అన్ని ప్రముఖ పుణ్య క్షేత్రాల్లో స్థల పురాణం, దేవతా విగ్రహాలు విశిష్టత తెలియచేసే విధంగా సూచక బోర్డులు ఏర్పాటు చేస్తున్నట్టు ప్రిన్సిపల్ సెక్రటరీ వాణిమోహన్ మంత్రి ఆళ్ల నానికి తెలిపారు...


ఆదాయం లేని ఆలయాలు అభివృద్ధిపై ద్రుష్టి పెట్టాలని, దాతలు, ప్రవసాండ్రులను ప్రోత్సాహించి చిన్న చిన్న ఆలయాలను కూడ అభివృద్ధి చేయాలని నిర్ణయించినట్టు వాణిమోహన్ మంత్రి ఆళ్ల నానికి వివరించారు...


దేవాదాయ శాఖ పరిధిలో రాష్ట్ర వ్యాప్తంగా 23వేల వరకు ఆలయాలు ఉన్నాయని, వాటిలో 2,700ఆలయాలను మాత్రమే దేవాదాయ శాఖ తరపున ఈఓలు పర్యవేక్షణ చేస్తున్నారని, మిగిలిన ఆలయాలు స్థానిక పూజారులు, పెద్దలు ఆధ్వర్యంలో పని చేస్తున్నట్టు వాణిమోహన్ మంత్రి ఆళ్ల నానికి వివరించారు...


నిధులు కొరత వల్ల అభివృద్ధికి నోచుకోని ఆలయాలను స్థానిక పర్యవేక్షణలో అభివృద్ధి చేయాలని దేవాదాయ శాఖ లక్ష్యంగా పెట్టుకున్నట్టు వాణిమోహన్ మంత్రి ఆళ్ల నానికి సవివివరంగా తెలిపారు...


గ్రామీణ ప్రాంతంలో ఆలయాలు అభివృద్ధికి ముందుకు వచ్చే దాతలు తమ ఆసక్తిని ఆన్లైన్లో ద్వారా, వ్యక్తిగతంగా గాని తెలియ చేయడానికి వీలుగా ప్రత్యేక దరఖాస్తూ ఫారాన్ని అందుబాటులో ఉంచినట్టు వాణి మోహన్ మంత్రి ఆళ్ల నానికి వివరించారు...



Comments