KL విద్యా సంస్థలో జరిగిన పూర్వ విద్యార్థుల సంఘం ...
తాడేపల్లి (ప్రజా అమరావతి);
కె.ఎల్. డీమ్డ్ యూనివర్సిటీలోని పూర్వ విద్యార్థుల విభాగం ఆధ్వర్యంలో 91 -92 బ్యాచ్ సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన పూర్వ విద్యార్థులందరికీ యూనివర్సిటీ అధ్యక్షులు కోనేరు సత్యనారాయణ, కార్యదర్శి కోనేరు కాంచనా లత శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అధ్యక్షులు కోనేరు సత్యనారాయణ మాట్లాడుతూ ఈ 25 ఏళ్లలో సంస్థలో జరిగిన పటిష్టమైన పురోగతిని తెలియజేశారు. విద్యార్థులలో నైపుణ్యాలను పెంపొందించడానికి, వారి విజ్ఞానాన్ని మరియు పని అనుభవాలను ఎప్పటికప్పుడు విద్యార్థులతో పంచుకుంటూ వారి ఉజ్వల భవిష్యత్తు కోసం పూర్వ విద్యార్థులు సహకరించాలని ఆయన కోరారు. నూతన సాంకేతిక పోకడలకు అనుగుణంగా విద్యా బోధనలో మార్పులు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ఛాన్సలర్ డాక్టర్ సారధి వర్మ, రిజిస్ట్రార్ వై.వి.ఎస్.ఎస్. ఎస్.వి ప్రసాద రావు, అల్యూమినై సినియర్ డైరక్టర్ కె రాజశేఖర్, డాక్టర్ పివిఆర్డి ప్రసాద్, డాక్టర్ కె సిహెచ్ శ్రీ కావ్య తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు పూర్వ విద్యార్థులు తాము చదువుకున్న తరగతి గదులను చూసి పులకించిపోయారు. వారికి విద్యను బోధించిన ఉపాధ్యాయులు వారిని ఆప్యాయంగా పలకరించారు మరియు పూర్వ విద్యార్థులు వారి టైమ్‌లైన్‌లోని అధ్యాపకులు, సిబ్బంది మరియు అటెండర్‌లను సత్కరించారు.
addComments
Post a Comment