కొవ్వూరు రూరల్, అర్బన్ పరిధిలో 13672 మందికి వైఎస్సార్ పెన్షన్ కానుక.



కొవ్వూరు (ప్రజా అమరావతి) ;  


కొవ్వూరు రూరల్, అర్బన్ పరిధిలో 13672 మందికి వైఎస్సార్ పెన్షన్ కానుక.



మొత్తం రూ.3 కోట్ల 45 లక్షలు పంపిణీ


కులాలు, మతాలు, రాజకీయ లకు అతీతంగా అర్హులకు సంక్షేమ పథకాలు


.... ... మంత్రి తానేటి వనిత


సామాజిక భద్రత కోసం వైఎస్సార్ పెన్షన్ కానుక గా కొవ్వూరు నియోజకవర్గ పరిధిలో 30,031 మంది కి రూ.754.78 లక్షల మేర ప్రయోజనాన్ని చేకూర్చడం జరిగిందని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు. జనవరి నుంచి రూ.2500 లకు పెంచి కొవ్వూరు మండలం లో మొత్తం 9659 మందికి రూ.241.10 లక్షలు, కొవ్వూరు అర్బన్ లో 4,013 మందికి రూ.103.88 లక్షల మేర పెన్షన్ అందిస్తున్నామన్నారు.  


సోమవారం కొవ్వూరు లో వైఎస్సార్ కానుక పెన్షన్ పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, తదితర కేటగిరి ల్లో కొవ్వూరు మండలం, పురపాలక సంఘం పరిధిలో 11,448 మందికి  ఇప్పటి వరకు ఇస్తున్న పెన్షన్ మొత్తాన్ని రూ.2250 పెన్షన్ న్నీ జనవరి నుంచి రూ.2500 లుగా పెంచి  అందిస్తున్నామన్నారు.  అర్హతే ప్రామాణికంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయడం కోసం వాలంటీర్ వ్యవస్థ తీసుకుని వొచ్చామన్నారు. కొవ్వూరు మండల పరిధిలో జనవరి నుంచి మరో 330 మందికి , అర్బన్ లో 78 మందికి కొత్త గా పెన్షన్లు మంజురూ చేసి, అందించడం జరిగిందన్నారు. జగనన్న ప్రభుత్వం మహిళాల, పేదల, బడుగు బలహీన వర్గాల పక్షపాత ప్రభుత్వ మన్నారు. కుల, మత, ప్రాంతం, రాజకీయ లకు అతీతంగా అర్హులైన వారికి సంక్షేమ పథకాలను అమలు చేస్తామని పాదయాత్ర చేస్తున్న సమయంలో జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేయడం జరుగుతోందన్నారు.  జగనన్న సంక్షేమ కార్యక్రమాలు భవిష్యత్తు తరాలకు ఆదర్శంగా నిలుస్తాయని మంత్రి పేర్కొన్నారు. కోవిడ్ సమయంలో ఏ సంక్షేమ కార్యక్రమాలు ఆపు చెయ్యకుండా అమలు చేసిన ఘనత జగనన్న కే చెల్లుతుందని తానేటి వనిత పేర్కొన్నారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు,  వృద్ధులు, దివ్యాంగులకు జనవరి నెల పెన్షన్ సొమ్మును మంత్రి అందచేశారు. 


ఈ కార్యక్రమానికి  మునిసిపల్ ఛైర్ పర్సన్ బావన రత్నకుమారి, మునిసిపల్ వైస్ ఛైర్ పర్సన్లు మన్నే పద్మ, గండ్రోతు అంజలీ దేవి, మాజి ఎమ్మెల్సీ కోడూరి శివరామకృష్ణ, మునిసిపల్ కమిషనర్ టి. రవికుమార్, కౌన్సిలర్లు, స్థానిక ప్రజా ప్రతినిధులు, తదితరులు హాజరయ్యారు.


Comments