15 నుంచి 18 ఏళ్ళు వరకు ఉన్న యువత కి కోవిడ్ టీకా వారోత్సవాలు

 


కొవ్వూరు (ప్రజా అమరావతి);


15 నుంచి 18 ఏళ్ళు వరకు ఉన్న యువత కి కోవిడ్ టీకా వారోత్సవాలు




కొవ్వూరు డివిజన్ పరిధిలోని 27907 మంది 15-18 ఏళ్ళు ఉన్న స్కూల్, కాలేజీలకు వెళుతున్న  విద్యార్థులను, 4802 స్కూల్ బయట ఉన్న పిల్లలను గుర్తించి కోవ్యాగ్జిన్ వ్యాక్సినేషన్ వేసే ప్రక్రియ ప్రారంభించడం జరిగిందని రెవెన్యూ డివిజనల్ అధికారి ఎస్. మల్లిబాబు తెలిపారు.


సోమవారం ఉదయం ఆర్డీవో కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ, ప్రభుత్వం ఆదేశాలు మేరకు కొవ్వూరు డివిజన్ పరిధిలో ఉన్న 15 నుంచి 18 ఏళ్ళు వరకు ఉన్న యువత కి కోవిడ్ టీకా కార్యక్రమం సోమవారం ఉదయం నుంచి ప్రారంభించడం జరిగిందన్నారు. 2022 ఫిబ్రవరి నాటికి 15 ఏళ్ళు వొచ్చే పిల్లలకు వ్యాక్సిన్ వెయ్యడం జరుగుతుందని తెలిపారు. తల్లిదండ్రులు తప్పనిసరిగా వారి పిల్లలకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి, టీకాలు వేయించాల్సి ఉందన్నారు. ప్రస్తుతం దేశంలో కోవిడ్, ఒమీక్రాన్ కేసులు నమోదు అవుతున్నాయని, అత్యంత భద్రత తో కూడిన వ్యాక్సిన్ తమ పిల్లలకు వేయించాలని విజ్ఞప్తి చేశారు. డివిజన్ పరిధిలో నూరుశాతం వ్యాక్సినేషన్ లక్ష్యాలను పూర్తి చేసేందుకు తహసీల్దార్ లు, ఎంపీడీఓ లు, డాక్టర్లు, విద్యా శాఖ అధికారులు సమన్వయంతో పనిచెయ్యలని ఆదేశించారు. స్కూలుకు వెళ్లే పిల్లలకు వారు చదువుకొనే పాఠశాల, కళాశాల వద్ద నే వ్యాక్సినేషన్ చెయ్యడం జరుగు తుందన్నారు. ప్రభుత్వ, ప్రవేటు విద్యా సంస్థలు వారి పరిధిలోని విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం తెలియచేసి, ఆయా విద్యా సంస్థల వద్దనే విద్యార్థుల కు టీకాలు వెయ్యాల్సి ఉందన్నారు. స్కూలుకు వేళ్ళని పై వయస్సు కేటగిరీ లోని పిల్లలకు గ్రామ, వార్డు సచివాలయంలో నే టీకాలు వెయ్యడం జరుగుతుందని ఆర్డీవో మల్లిబాబు పేర్కొన్నారు. కొన్ని ప్రవేటు విద్యా సంస్థలు పిల్లలకు టీకాలు వేసేందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని తమ దృష్టికి తెచ్చారన్నారు. 15 ఏళ్ళు నిండిన పిల్లల కు తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించి సామాజిక తీసుకోవాలని కోరారు.. ప్రెవేటు విద్యా సంస్థలు వారి వద్ద ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి స్వల్ప సందేశం (SMS లు) పంపాలని తెలిపారు. కోవిడ్ వ్యాక్సిన్ పై ఎటువంటి సందేహం అక్కర్లేదని ఇప్పటికే కోట్లాది మంది వ్యాక్సిన్ వేసుకోవడం జరిగిందని, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు పెద్ద ఎత్తున వ్యాక్సిన్ తీసుకున్నారని తెలిపారు. పిల్లలకు సకాలంలో వ్యాక్సిన్ వేయించడం ద్వారా సురక్షితులం అవుదామన్నారు.  కోవిడ్, ఒమీక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించడం, శానిటైజర్స్ వాడడం, భౌతిక దూరం పాటించాల్సి ఉందని ఆర్డీవో తెలిపారు.


Comments