ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్ట్ కు రూ 2 కోట్ల విరాళం

 ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్ట్ కు రూ 2 కోట్ల విరాళం


తిరుమల 13 జనవరి (ప్రజా అమరావతి): టీటీడీ ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్ట్ కు భారత్ బయోటెక్ సంస్థ అధినేత శ్రీ కృష్ణ ఎల్లా, శ్రీమతి సుచిత్ర ఎల్లా రూ 2 కోట్ల విరాళం అందించారు.

గురువారం తెల్లవారుజామున శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనం అనంతరం వీరు రంగనాయక మండపం లో ఈ మేరకు డి డి లను టీటీడీ ఛైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి, ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి కి అందించారు.