జనవరి 27న పంచగవ్య ఉత్పత్తుల ప్రారంభం

 జనవరి 27న పంచగవ్య ఉత్పత్తుల ప్రారంభం


ఏర్పాట్లను పరిశీలించిన జెఈవో శ్రీ వీరబ్రహ్మం

తిరుపతి 24 జనవరి (ప్రజా అమరావతి): కోయంబత్తూరుకు చెందిన ఆశీర్వాద్ ఆయర్వేద సంస్థ సహకారంతో టీటీడీ తయారు చేసిన 15 రకాలు పంచగవ్య గృహ ఉత్పత్తులను జనవరి 27 వ తేదీ ప్రారంభిస్తున్నామని జెఈవో శ్రీ వీరబ్రహ్మం తెలిపారు.

తిరుపతి డిపిడబ్ల్యు స్టోర్ లోని తయారీ ప్లాంట్ ను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. టీటీడీ గో సంరక్షణకు పెద్ద పీట వేస్తోందన్నారు. ఇందులోభాగంగానే పంచగవ్య ఉత్పత్తుల తయారీకి పూనుకుందని చెప్పారు. టీటీడీ చైర్మన్, ఈవో, అదనపు ఈవో ప్రత్యేక శ్రద్ధతో తక్కువ సమయంలోనే ఈ ఉత్పత్తుల తయారీ సాకారం అయ్యిందన్నారు. దీంతో పాటు డ్రై ఫ్లవర్ టెక్నాలజీతో తయారు చేసిన చిత్ర పటాలు, ఇతర ఉత్పత్తుల విక్రయాలు కూడా అదే సందర్భంగా ప్రారంభించడానికి ఏర్పాట్లు చేశామన్నారు. టీటీడీ ఉద్యోగులకు నగదు రహిత వైద్యం అందించడానికి పలు ఆసుపత్రులతో ఎంఓయు కుదుర్చుకోవడం జరుగుతుందన్నారు.

సి ఈ శ్రీ నాగేశ్వరరావు, గోశాల డైరెక్టర్ డాక్టర్ హరినాథ రెడ్డి, విజి ఓ శ్రీ మనోహర్, అదనపు ఆరోగ్యాధికారి డాక్టర్ సునీల్ కుమార్ పాల్గొన్నారు

Comments