అభివృద్ధిపై 30 ఏళ్ళ లక్ష్యంతో ముఖ్యమంత్రి అడుగులు : పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డిశ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా (ప్రజా అమరావతి);.


*అభివృద్ధిపై 30 ఏళ్ళ లక్ష్యంతో ముఖ్యమంత్రి అడుగులు : పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి* *కొత్త సంవత్సరంలో వైఎస్ఆర్ పింఛన్ కానుక పెంపుతో అవ్వ,తాతల ఆశీర్వాదం*


*అధికారంలోకి రాగానే ప్రమాణస్వీకారం సందర్భంగానూ పింఛన్ పైనే సీఎం జగన్ తొలి సంతకం*


*ఇచ్చిన మాటను తప్పకుండా హామీలను అమలు చేయడంలో దేశానికే ఏపీ సీఎం రోల్ మోడల్*


శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా, జనవరి, 01: ఇచ్చిన ప్రతి హామీని అంచెలంచెలుగా అమలు చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దేశానికే రోల్ మోడల్ గా నిలుస్తున్నారని పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. అభివృద్ధిపై 30 ఏళ్ళ లక్ష్యంతో ముఖ్యమంత్రి నడిపిస్తున్నారన్నారు. వైఎస్ఆర్ పింఛన్ కానుక పెంపుపై ముఖ్యమంత్రి నిర్వహించిన కార్యక్రమంలో నెల్లూరు జిల్లా కలెక్టరేట్ లోని తిక్కన భవన్ నుంచి మంత్రి మేకపాటి వర్చువల్ గా పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కష్టకాలం, క్లిష్ట పరిస్థితుల మధ్య ఉన్నా, ఎవరెన్ని మాటలన్నా.. ఇచ్చిన మాటకు కట్టుబడి  సీఎం పని చేస్తున్నారని మంత్రి పేర్కొన్నారు.  మేనిఫెస్టోను ఖురాన్,బైబిల్, భగవద్గీతలుగా భావించి వైఎస్ఆర్ పింఛన్ కానుక పెంపును 2022 కొత్త ఏడాది సందర్భంగా ప్రారంభించి అవ్వ,తాతల మోములో చిరునవ్వుల పువ్వులు పూయిస్తున్నారన్నారు. నవరత్నాల ద్వారా సంక్షేమం, సంస్కరణలు, సరైన నిర్ణయాల ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా సీఎం జగన్ మరింత ముందుకు నడిపిస్తున్నారన్నారు. ఏ పని చేయలేని వృద్ధులకు సామాజిక బాధ్యత పింఛన్ ఇవ్వడం , ఆ మొత్తాన్ని పెంచడం వల్ల వారికి అండగా నిలవడంతో పాటు, ప్రజాప్రతినిధులైన మాలాంటి వారికీ గౌరవం అభిస్తోందన్నారు. ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా తరపున ముఖ్యమంత్రికి మంత్రి మేకపాటి ధన్యవాదాలు తెలిపారు.