రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి వారి ఆధ్వర్యంలో చిన్మయి విజయ ఆశ్రమానికి 50 వేలు విలువ గల సరుకులు పంపిణీ.

 తాడేపల్లి/మంగళగిరి (ప్రజా అమరావతి);రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి వారి ఆధ్వర్యంలో చిన్మయి విజయ ఆశ్రమానికి 50 వేలు విలువ గల సరుకులు పంపిణీ.ఐ.జె.ఎం. రోటరీ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ డెక్కన్, మరియు రోటరీ క్లబ్ ఆఫ్ జూబ్లీహిల్స్ వారి సహకారంతో బుధవారం 73వ గణతంత్ర దినోత్సవం  సందర్భంగా రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి వారి ఆధ్వర్యంలో మంగళగిరి  కాజా గ్రామం లోని

చిన్మయి విజయ అనాధ ఆశ్రమానికి 50 వేలు విలువ గల బియ్యం,సబ్బులు, బ్రష్ లు,పేస్టులు, షాంపూలు,గోబ్బరి నూనె, డైలీ నీడ్స్ కు సంబంధించిన సరుకులను అందజేశారు ఈ సందర్భంగా రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి అధ్యక్షులు జంగాల వెంకటేష్ మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఐ.జె. ఎం. రోటరీ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ డెక్కన్ మరియు రోటరీ క్లబ్ ఆఫ్ జూబ్లీహిల్స్ వారి ఆర్థిక సహకారంతో చిన్మయి విజయ అనాధ ఆశ్రమానికి నెలకు 50,వేలు  

విలువగల సరుకులను ఇవ్వడం జరిగిందని తెలిపారు,జనవరి  నెల నుండి మార్చి నెల వరకు ప్రతి నెల మూడు నెలల పాటు 50 వేలు విలువచేసే సరుకులను ఇవ్వనున్నట్లుతెలిపారు.

ఇవి మా చేతుల మీదగా చేయించడం సంతోషంగా ఉందని అన్నారు, భవిష్యత్తులో ఇలాంటి మంచి కార్యక్రమాలు రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి చేపడుతుందని అన్నారు, ఈ కార్యక్రమంలో

ఐ.జె.ఎం కంపెనీ ప్రతినిధి వరప్రసాద్, పి.డి.జి అన్నే రత్న ప్రభాకర్, అసిస్టెంట్ గవర్నర్ అనిల్ చక్రవర్తి, రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి కార్యదర్శి కిరణ్ పరుచూరి,సర్వీస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ రామకృష్ణ, సుకుమార్,చిన్మయి విజయ ఆశ్రమ చైర్మన్ ముక్కమల అప్పారావు సుమతి తదితరులు పాల్గొన్నారు.

Comments