సామాజిక భద్రత పెన్షన్ల్ కింద రూ.754.78 లక్షలు పంపిణికొవ్వూరు (ప్రజా అమరావతి); 


కొవ్వూరు నియోజకవర్గ స్థాయిలో 30,001 మందికి వైఎస్సార్ కానుక సామాజిక భద్రత పెన్షన్ల్ కింద రూ.754.78 లక్షలు పంపిణి


చేస్తున్నామని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు. 


స్థానిక మంత్రి క్యాంపు కార్యాలయంలో శనివారం జనవరి  పెన్షన్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొని లబ్దిదారులకి పెన్షన్స్ అందచేశారు.  ఈ సందర్భంగా మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ, పశ్చిమగోదావరి జిల్లాలో వైఎస్సార్ సామాజిక భద్రత పెన్షన్స్ కింద 4,97,279 మందికి రూ.126.21 కోట్లు పంపిణీ చేస్తున్నామన్నారు. జనవరి నెలలో మరో 13,722 మందికి రూ.3.21 కోట్లు అందచేయ్యడం జరుగుతున్నట్లు పేర్కొన్నారు. జనవరి నెలలో అందచేసే పెన్షన్. మొత్తాన్ని రూ.2250 నుంచి రూ.2500 కి పెంచడం జరిగిందని ఆమె పేర్కొన్నారు. కొవ్వూరు నియోజకవర్గ పరిధిలోని 30,001 మందికి రూ.754.78 లక్షలు లబ్దిదారుల ఇంటి వద్దనే అందించడం జరుగుతున్న దని తెలిపారు. నియోజకవర్గములో చాగల్లు మండలం లో 8919 మంది కి రూ.224.43 లక్షలు, కొవ్వూరు రూరల్ లో 9659 మందికి రూ.241.11 లక్షలు , కొవ్వూరు అర్బన్ లో 4013 మందికి రూ.103.88 లక్షల ను పంపిణీ చేస్తున్నా మన్నారు. నియోజకవర్గంలో జనవరి నుంచి మరో 901 మంది కొత్త గా పెన్షన్లు మంజురూ చేసి అందిస్తున్నామని వనిత తెలిపారు.  అర్హులైన పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించడం లో ప్రభుత్వం పూర్తి స్థాయిలో చిత్తశుద్దితో పనిచేయ్యాడమే లక్ష్యం గా అత్యంత పారదర్శకంగా పరిపాలన అందిస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వం జగనన్న సామాజిక భద్రత పెన్షన్ రూ 2 వేలు ఇస్తానని ప్రకటన చేసిన నేపథ్యంలో, అప్పటి వరకు రూ.1000 లు ఉండే పెన్షన్ ఎన్నికలకు రెండే రెండు నెలలు ముందు రూ.2 వేలు చేసి, ప్రజల్ని మోసం చేసేందుకు ఎత్తుగడ వేశారన్నారు. జగనన్న పెన్షన్ ను రూ.3 వేలకు పెంచుకుంటూ వెళతానని ఇచ్చిన హామీకి కట్టుబడి రూ.2500 లకు పెంచి ఇస్తున్నామన్నారు.


ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ ఛైర్మెన్, పోసిన శ్రీలేఖ, ఎం. పి. పి. కాకర్ల సత్యనారాయణ (నారా యుడు), వైస్ యం. పి. పి. వీరమళ్ళ నారాయుడు , డి. యల్. డి. ఓ, పి. జగదాంబ,  జెడ్. పి. టి. సి. బొంతా వెంకట లక్ష్మి, అధికారులు, సర్పంచ్ లు నాయకులు, పాల్గొన్నారు.