పెనుమంట్ర మండలం లో మరో ఎనిమిది లే అవుట్లలో 917 మంది లబ్దిదారులకి ఇళ్ల నిర్మాణం కోసం ఉచితంగా అందించాము.

 


పెనుమంట్ర (ప్రజా అమరావతి);  


పెనుమంట్ర మండలం లో మరో ఎనిమిది లే అవుట్లలో  917 మంది లబ్దిదారులకి ఇళ్ల నిర్మాణం కోసం ఉచితంగా అందించామని


రాష్ట్ర గృహ నిర్మాణ శాఖమంత్రి చెరుకువాడ శ్రీ రంగనాథరాజు పేర్కొన్నారు.


బుధవారం పెనుమంట్ర మండలం లో అలమూరు, మార్టేరు, నెగ్గిపూడి, వెలగలేరు గ్రామాల్లో అధికారులతో కలసి మంత్రి లే అవుట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీరంగనాధ్ రాజు మాట్లాడుతూ, రాష్ట్రంలో అర్హత ఉన్న ప్రతి ఒక్క కుటుంబానికి స్వంత ఇల్లు కల్పించే దిశగా కోట్లాది రూపాయలను చెల్లించి భూముల ను కొనుగోలు చేసి పేద లకు ఉచితంగా అందిస్తున్నామన్నారు. అదే కాకుండా సంబంధించిన లే అవుట్లలో మెరుగైన మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రణాళికలు తయారు చేయడం జరుగుతోందన్నారు. ఈ రోజు పెనుమంట్ర మండలం లోని 4 గ్రామాల్లో 8 లే అవుట్ల లో 917 మంది లబ్ధిదారులకు స్థలాలు కేటాయించామని, ఇప్పటికే 149 మంది లబ్దిదారులచే ఇళ్ల నిర్మాణా లు ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ ఇళ్ల నిర్మాణం కోసం రూ. కోటి 5 లక్షలు విడుదల చేసారని,  రూ. 77.68 లక్షలు చెల్లింపులు  చేసామని, మెటీరియల్స్ కోసం మరో రూ.27.46 లక్షలు ఖర్చు చేసినట్లుగా ఆయన తెలిపారు.  ఇళ్ల నిర్మాణం విషయంలో అధికారులు నిబద్ధతతో పనిచెయ్యలని ఆదేశించారు. విధుల్లో అలసత్వం వహిస్తే సహించేది లేదన్నారు. ప్రభుత్వం వేల కోట్ల ను ఖర్చు చేస్తున్న ఇళ్ల నిర్మాణాలు ప్రతిష్టాత్మకంగా చేపట్టి, ప్రణాళికలు మేరకు పూర్తి చెయ్యాల్సి ఉంటుందని మంత్రి తెలిపారు. 



మంత్రి పర్యటన సందర్భంగా  కోమటిచెరువు పుంతలో గల హౌసింగ్ లేఅవుట్,  వెలగలేరు  లో రెండు  హౌసింగ్ లేఅవుట్ , నెగ్గిపూడి పంచాయతీ లో గల రెండు హౌసింగ్ లేఅవుట్,  మార్టేరు రోడ్డులో  గల మరో 3  హౌసింగ్ లేఅవుట్ నందు అధికారులు, లబ్ధిదారులతో మంత్రి సమావేశం నిర్వహించడం జరిగింది.



ఈ కార్యక్రమంలో ఎంపీపీ కర్రి వెంకట నారాయణ రెడ్డి( వాసు), జెడ్పిటిసి కర్రి గౌరీ సుభాషిని, సర్పంచ్ లు ఎంపీటీసీలు, నాయకులు లబ్ధిదారులు, ఎంపీడీవో రాంబాబు, తాసిల్దార్ దుర్గా కిషోర్, హౌసింగ్ డీఈ, ఆర్డబ్ల్యూఎస్ డిఈ,హౌసింగ్ ఏఈ, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ, ఎలక్ట్రికల్ ఏఈ, వివిధ శాఖల అధికారులు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు .


Comments