కాకాణి చేతులు మీదుగా "వై.యస్.ఆర్.ఈబిసి నేస్తం" ప్రారంభం.

 కాకాణి చేతులు మీదుగా "వై.యస్.ఆర్.ఈబిసి నేస్తం" ప్రారంభం.




శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గం, వెంకటాచలం మండల కేంద్రంలో "వై.యస్.ఆర్. ఈబిసి నేస్తం" ద్వారా 2,193 మంది మహిళలకు అందిస్తున్న ఆర్ధిక సహాయం 3కోట్ల 29 లక్షల రూపాయల చెక్కును ప్రదర్శించిన వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసన సభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి .


జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం ద్వారా లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్ పత్రాలను అందించిన ఎమ్మెల్యే కాకాణి.




 మేనిఫెస్టోలో ప్రజలకు ఇచ్చిన హామీలతో పాటు, అదనంగా మరెన్నో హామీలు అమలు చేస్తూ, ఆర్థికంగా వెనుకబడిన ఉన్నత వర్గాల వారికి కూడా *"వై.యస్.ఆర్.ఈబిసి నేస్తం"* ద్వారా ఆర్థిక సహాయం అందిస్తున్న ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారిది.


 వై.యస్.ఆర్.ఈబిసి నేస్తం ద్వారా మూడో విడతలుగా 15వేల రూపాయల చొప్పున ఒక్కో మహిళకు 45వేల రూపాయలతో నిర్దేశించిన పథకంలో భాగంగా, తొలి విడతగా ఆంధ్రరాష్ట్రంలో 3లక్షల 92 వేల కుటుంబాలకు 589 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కి వారి ఖాతాలో జమ చేశారు.


 సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి 2,193 మంది 45- 60 సంవత్సరాలలోపు ఉన్న ఓసి మహిళలకు, 3 కోట్ల 30 లక్షల రూపాయలు తొలి విడతలో 15వేల రూపాయల చొప్పున ఆర్ధిక సహాయం అందిస్తున్నాం.


 *"వైయస్సార్ కాపు నేస్తం"* ద్వారా కాపు, బలిజ, ఒంటరి సామాజిక వర్గాలకు చెందిన మహిళలకు ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా, ఒక్కొక్క విడతలో 15 వేల రూపాయల చొప్పున ఇప్పటికే ఆర్ధిక సహయం అందిస్తున్నాం.


 సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి *"వై.యస్.ఆర్.చేయూత పధకం"* ద్వారా 45 నుండి 60 సంవత్సరాలలోపు ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందిన మహిళలకు రూ.18,750/- ల చొప్పున రెండు విడతల్లో 50 కోట్ల రూపాయలు ఆర్థిక సహాయం అందించాం.


 జగన్మోహన్ రెడ్డి గారు అన్ని వర్గాలకు చెందిన పేద మహిళలకు అండగా నిలవాలనే లక్ష్యంతో అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభించి, వాటిని సమర్థవంతంగా అమలు చేస్తున్నారు.


 పేద కుటుంబాలకు చెందిన మహిళలకు మెరుగైన జీవనోపాధి కల్పించి, వారు ఆర్థికంగా నిలదొక్కుకోవాలనే లక్ష్యంతో, జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్న కానుక *"వై.యస్.ఆర్.ఈబిసి నేస్తం"*


 తెలుగుదేశం పార్టీ గతంలో మహిళల రుణాల మాఫీ, రైతు రుణమాఫీ, చేనేతల రుణమాఫీ పేరిట వాగ్దానాలు చేసి, అధికారంలోకి వచ్చి వాటిని అమలు చేయకుండా, ప్రజలను నిట్టనిలువునా మోసం చేశారు.


 జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన హామీలను నెరవేరుస్తూ, చెప్పనటువంటివి కూడా, ప్రజలకు అవసరం అని భావిస్తే, నూతనంగా ప్రారంభించి, అమలు చేస్తున్నారు.


 సర్వేపల్లి నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో సమగ్రంగా, సంపూర్ణంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాం.


 సర్వేపల్లి నియోజకవర్గంలో అభివృద్ధి గురించి మేము మాట్లాడటం, ప్రతిపక్షాలు విమర్శలు చేయడం కాదు, ప్రజల్లోకి వెళ్లితే, నేను అధికార పార్టీ శాసన సభ్యునిగా 30 నెలల కాలంలో అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రత్యక్షంగా తెలుసుకోవచ్చు.


 వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యునిగా రెండు సార్లు అవకాశమిచ్చిన నియోజకవర్గ ప్రజానీకానికి నిత్యం అందుబాటులో ఉండి, సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తా.

Comments