*"కాకాణి చేతులు మీదుగా పెన్షన్ పంపిణీ
"*
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, తోటపల్లి గూడూరు మండలంలో నూతనంగా మంజూరైన పెన్షన్లను పంపిణీ చేసిన వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి .
*నూతనంగా మంజూరైన ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కాకాణి.*
కరోనా కష్ట కాలంలో రాష్ట్ర ఆదాయం గణనీయంగా తగ్గినా, సంక్షేమ పథకాలకు ఎటువంటి అవరోధం కలగకుండా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాట చెప్పిన విధంగా అమలు చేస్తున్నారు.
వై.యస్.ఆర్.పెన్షన్ కానుక 2 వేల రూపాయల నుండి 3 వేలకు పెంచుతానని జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారు.
ఎన్నికల హామీని నిలబెట్టుకుంటూ, అధికారంలోకి వచ్చిన నాటి నుండి 2,250/- రూపాయలు పెన్షన్ అమలు చేస్తూ, పేదలకు నూతన సంవత్సరం కానుకగా పెంచిన పెన్షన్ 2500/- రూపాయలు అందించడం సంతోషం.
తెలుగుదేశం హయాంలో పెన్షన్ తీసుకుంటున్నవారు చనిపోతే తప్ప, కొత్త పెన్షన్ మంజూరు చేయలేదు.
చంద్రబాబు 1000/- రూపాయలు పెన్షన్ ప్రకటించి, అర్హులను పక్కనబెట్టి రాజకీయాలకు ప్రాధాన్యతనిచ్చి, పేదల జీవితాలతో చెలగాటం ఆడుకున్నాడు.
చంద్రబాబు 4 సంవత్సరాల, 9 నెలలు 1000/- రూపాయలు చొప్పున పెన్షన్ అందించి, ఎన్నికలకు ముందు ఓట్లు రాబట్టుకునేందుకు 2 వేల రూపాయలకు పెంచాడు.
వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి 2,250/- రూపాయల పెన్షన్ అందిస్తూ, కొత్త సంవత్సరంలో 2,500/- రూపాయలకు పెంచడం జరిగింది.
సర్వేపల్లి నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్ అందించడంతో పాటు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించే బాధ్యత నాది.
సర్వేపల్లి నియోజకవర్గానికి రెండు సార్లు శాసన సభ్యునిగా అవకాశం ఇచ్చిన ప్రజల రుణం తీర్చుకోవడానికి, నా శాయశక్తులా కృషి చేస్తా
addComments
Post a Comment