*కరోనా నేపథ్యంలో అన్ని రకాల వనరులు అందుబాటులో ఉంచుకోవాలి*
*: జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి*
*: హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్*
హిందూపురం, జనవరి 12 (ప్రజా అమరావతి):
*కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మెరుగైన వైద్య చికిత్స అందించేందుకు అన్ని వనరులను అందుబాటులో ఉంచుకోవాలని జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి వైద్యాధికారులను ఆదేశించారు. బుధవారం హిందూపురం ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) ఏ.సిరి, పెనుకొండ సబ్ కలెక్టర్ నవీన్, తదితరులు పాల్గొన్నారు.*
*హిందూపురంలోని ప్రభుత్వ ఆసుపత్రి ని తనిఖీ చేసి నూతనంగా ఏర్పాటు చేసిన విఆర్డీఎల్ ల్యాబ్ ను, ట్రయేజింగ్ రూమ్ ను, ఆక్సిజన్ ప్రొడక్షన్ ప్లాంట్ ని పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోవిడ్ థర్డ్ వేవ్ ని ఎదుర్కొనేందుకు ఏ విధంగా ఏర్పాట్లు చేశారు, కోవిడ్ సోకిన వారు వచ్చినప్పుడు ఎక్కడి నుండి ఆస్పత్రిలోకి తీసుకురావాలి, ఎక్కడ ట్రయేజింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలి, తదితర వాటిని పరిశీలించి పలు సూచనలు, సలహాలు అందజేశారు. ఆస్పత్రిలో లిక్విడ్ ఆక్సిజన్ మెయింటినెన్స్ ఏవిధంగా ఉంది, ఎంత మొత్తంలో ఆక్సిజన్ నిల్వలు ఉన్నాయి తదితర వాటిని కలెక్టర్ పరిశీలించారు. చికిత్స పొందుతున్న మహిళలను, వృద్ధులను పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితులను గురించి అడిగి తెలుసుకున్నారు. కోవిడ్ మరణాలు సంభవించినకుండా మెరుగైన చికిత్సలు అందించాలని జిల్లా కలెక్టర్ సూచించారు. ఆస్పత్రిలో ఎమర్జెన్సీ కేసులు కూడా చూడాలని, ఎమర్జెన్సీ కేసులు చూసేందుకు, కోవిడ్ కేసులు చూసేందుకు ప్రత్యేకంగా డాక్టర్లను నియమించాలన్నారు. డాక్టర్లకు డ్యూటీలల్ రోస్టర్లు సక్రమంగా వేయాలన్నారు. డ్యూటీలకు డాక్టర్లు సక్రమంగా హాజరవుతారా లేదా అనేది పరిశీలించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. కోవిడ్ ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అన్ని విధాలా సిద్ధంగా ఉండాలన్నారు.*
*కోవిడ్ మూడో దశ వ్యాప్తి నేపథ్యంలో హెల్త్ కేర్, ఫ్రంట్ లైన్ వర్కర్లు, 60 ఏళ్లు పైబడిన వృద్ధులకు కోవిడ్ వ్యాక్సిన్ బూస్టర్ డోస్ వేసే కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కోవిడ్ వైరస్ నుండి రక్షణ పొందేందుకు ప్రభుత్వం అందిస్తున్న కోవిడ్ బూస్టర్ డోస్ వ్యాక్సిన్ ను అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవాలని కోరారు.*
*అప్రమత్తంగా ఉండాలి :*
*కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సూచించారు. బుధవారం హిందూపురం పట్టణంలోని రెండో మోడల్ కాలనీ నందు కోవిడ్ బాధితులు ఇళ్ల వద్దకు వెళ్లి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. హోఎం ఐసొల్యూషన్ కిట్టు అందించారా? మెడికల్ సిబ్బంది వస్తున్నారా? ప్రస్తుతం ఆరోగ్యం ఎలా ఉంది తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. లక్షణాలు తక్కువగా ఉంటే హోమ్ ఐసొలేషన్ లో ఉండాలని సూచించారు.*
*ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ శివ కుమార్ స్వామి, ఆర్ఎంఓ రుక్మిణమ్మ, సివిల్ సర్జన్ రాజగోపాల్, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు, తహశీల్దార్ శ్రీనివాసులు, హౌసింగ్ ఎఈ నారాయణరెడ్డి, స్పెషల్ ఆఫీసర్ సురేష్ కుమార్, వివిధ అధికారులు తదితరులు పాల్గొన్నారు.*
addComments
Post a Comment