- ఉత్సాహభరిత వాతావరణంలో జాతీయ స్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బండలాగుడు ప్రదర్శన పోటీలు
- 12 న నాలుగు పళ్ళ విభాగంలో నిర్వహిస్తున్నాం
- ఉదయం 9 గంటలకు ప్రారంభించనున్న కైకలూరు ఎమ్మెల్యే దూలం
- వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నేత దుక్కిపాటి శశిభూషణ్
గుడివాడ, జనవరి 11 (ప్రజా అమరావతి): జాతీయ స్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బండలాగుడు ప్రదర్శన పోటీలు ఉత్సాహభరిత వాతావరణంలో జరుగుతున్నాయని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నేత దుక్కిపాటి శశిభూషణ్ చెప్పారు. మంగళవారం మంత్రి కొడాలి నాని క్యాంపు కార్యాలయంలో దుక్కిపాటి శశిభూషణ్ మాట్లాడారు. గుడివాడ పట్టణం లింగవరం రోడ్ లోని కే. కన్వెన్షన్ లో ఐదు రోజులపాటు పోటీలు జరుగుతాయని తెలిపారు. తొలిరోజు రెండు పళ్ళ విభాగంలో మొత్తం 19 ఎడ్ల జతలు హోరాహోరీగా పోటీ పడ్డాయన్నారు. ఈనెల 12వ తేదీన నాలుగు పళ్ళ విభాగంలో పోటీలు జరుగుతాయని, ఈ పోటీలను ఉదయం 9 గంటలకు కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరావు ప్రారంభిస్తారని చెప్పారు. పోటీల్లో పాల్గొంటున్న ఎడ్ల జతలకు, వాటి యజమానులకు కూడా ఆహారం, వసతి సదుపాయాలను కల్పించామన్నారు. పశు పోషకులు, రైతులు, ప్రజలు గ్యాలరీల్లో కూర్చుని ఈ ప్రదర్శన పోటీలను ప్రత్యక్షంగా వీక్షిస్తున్నారని తెలిపారు. అందరూ పెద్ద ఎత్తున పాల్గొని జాతీయ స్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బండలాగుడు ప్రదర్శన పోటీలను విజయవంతం చేయాలని దుక్కిపాటి శశిభూషణ్ విజ్ఞప్తి చేశారు.
addComments
Post a Comment