గుడివాడలో ఓడించాలంటే ఏదో ఒకటి చేయాలన్న ఆలోచనకు వచ్చిన చంద్రబాబు- గుడివాడలో ఓడించాలంటే ఏదో ఒకటి చేయాలన్న ఆలోచనకు వచ్చిన చంద్రబాబు


- 2014, 2019 ఎన్నికల్లోనూ విశ్వప్రయత్నాలు

- చివరికి కేసినో జరిగిందంటూ అల్లరల్లరి చేస్తున్నారు

- చీర్ బాయ్స్ ను పంపి చీర్ ఛానల్స్లో సొల్లు కబుర్లు

- కన్నెత్తి చూడని గుడివాడ తెలుగుదేశం పార్టీ నేతలు

- కేసినోను వదలకుండా 362 రోజులూ చూపించండి

- రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నానిగుడివాడ, జనవరి 29 (ప్రజా అమరావతి): చంద్రబాబు, ఆయన టీం కలిసి నన్ను ఎట్టి పరిస్థితుల్లో ఓడించాలంటే ఏదో ఒకటి చేయాలన్న ఆలోచనకు వచ్చాయని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) అన్నారు. శనివారం కృష్ణాజిల్లా గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంలో మంత్రి కొడాలి నాని మీడియాతో మాట్లాడారు. గుడివాడ నియోజకవర్గం నుండి వరుసగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలుస్తూ వస్తున్నానని తెలిపారు. 2012 లో చంద్రబాబు విధానాలతో విబేధించి వైఎస్ జగన్మోహనరెడ్డిని కలిశానని చెప్పారు. 2014 లో టీడీపీ, ఆ పార్టీలోని పోటుగాళ్ళు నన్ను ఓడించేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారన్నారు. 2019 లో కూడా ఓడించేందుకు చేయని ప్రయత్నం లేదని, ఏమీ పీకలేక పోయిందన్నారు. చివరికి టీడీపీ ఖాళీ అయిపోయిందని తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. కేసినో వ్యవహారంలో గుడివాడ ప్రజలకు ఎటువంటి సంబంధం లేదని, ఒకవేళ జరిగి ఉంటే ఇక్కడి ప్రజలు తెలుసుకోలేనంత అమాయకులా అని ప్రశ్నించారు. చీర్ బాయ్స్ ను పంపి డ్యాన్స్లు, చీర్ ఛానల్స్లో గంటల తరబడి సొల్లు కబుర్లు చెప్పకపోతే గుడివాడ ప్రజలకు తెలియదా అని అన్నారు. కేసినో జరిగిందంటూ అల్లరల్లరి చేశారని, గుడివాడ ప్రజానీకంతో పాటు చివరకు గుడివాడలో ఉన్న తెలుగుదేశం పార్టీ కూడా వీళ్ళ మోతను పట్టించుకోలేదని అన్నారు. 420 మాటలు మాట్లాడుతూ చీర్ బాయ్స్ గుడివాడకు వచ్చి గంతులేస్తుంటే ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. అందువల్లే గుడివాడ తెలుగుదేశం పార్టీ కనీసం చీర్ బాయ్స్ వైపు కన్నెత్తి కూడా చూడలేదన్నారు. అయినా వదలకుండా డీఎస్పీ, ఎస్పీ, డీఐజీ, డీజీపీ, జిల్లా కలెక్టర్, గవర్నరు ఫిర్యాదులు చేస్తూ వస్తున్నారన్నారు. ఇది చాలక అమెరికా అధ్యక్షుడు బైడెన్ ను కూడా వెళ్ళి ఫిర్యాదు చేసే పరిస్థితి ఉందన్నారు. అంతర్జాతీయ సమాజం దృష్టికి కూడా తీసుకువెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయన్నారు. ఫిర్యాదులు చేయడానికి గల ఉద్దేశ్యం ఏంటంటే బయటకు వచ్చి మీడియా ముందు డ్యాన్స్లు వేయడం, నన్ను తిట్టి వెళ్ళడమేనని అన్నారు. సీఎం జగన్మోహనరెడ్డి చర్యలు తీసుకోవాలని డిమాండ్ కూడా చేస్తున్నారన్నారు. చంద్రబాబు, 420 మీడియా ఉచ్చులో పడే అమాయకులు కాదని అన్నారు. వీళ్ళ క్యాబరే కథలు, డ్రామాలు, డ్యాన్స్లు సీఎం జగన్ నమ్మరని అన్నారు. నన్ను అల్లరి చేయడానికి ప్రయత్నిస్తున్నారని సీఎం జగన్ గ్రహించడం వల్లే ఏమీ అనలేదని బాధపడుతున్నారన్నారు l. గుడివాడ పట్టణంలో కేసినో నిర్వహించారని, మూడు రోజుల్లో రూ . 500 కోట్లు వచ్చాయని నోటికి వచ్చినట్టుగా మాట్లాడుతున్నారన్నారు. గోవాలో 50 కేసినో నిర్వహించే కంపెనీలు ఉన్నాయని, అక్కడ మూడు రోజుల్లో రూ.25 వేల కోట్లు వస్తాయా అని ప్రశ్నించారు. కేసినో వ్యవహారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలవద్దని సూచించారు. గోవా చీర్ గర్ల్స్ మూడు రోజుల పాటు రాష్ట్ర ప్రజలను ఆనందింపజేస్తే మిగిలిన 362 రోజుల పాటు అవసరమైతే ఇంకో పది మంది చీర్ బాయ్స్ ను పెంచైనా ఏబీఎన్, ఈటీవీ, టీవీ 5 ల్లో 24 గంటల పాటు ప్రసారం చేయించాలన్నారు. నాని, నాని అంటూ నా పాటలు వేస్తూనే, డ్యాన్స్లు వేయిస్తూనే, చీర్ బాయ్స్ ను కూడా పెట్టి 362 రోజులు గుడివాడ కేసినో వ్యవహారం గురించి తప్ప ఇంకా వేరే ఏ న్యూస్ ను వేయొద్దని సూచించారు. మీకు చేతనైనంది ఏం చేయగలరో మీ ఇష్టం, జీవితకాలం టైం ఇచ్చానని, పీక్కోవాలని మంత్రి కొడాలి నాని సవాల్ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నేత దుక్కిపాటి శశిభూషణ్, జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఉప్పాల హారిక, ఉప్పాల రాము, మున్సిపల్ మాజీ వైస చైర్మన్ అడపా బాబ్జి, వైసీపీ పట్టణ అధ్యక్షుడు గొర్ల శ్రీను, ఎన్టీఆర్ స్టేడియం కమిటీ ఉపాధ్యక్షుడు పాలేటి చంటి, సంయుక్త కార్యదర్శి పర్వతనేని ఆనంద్, సభ్యులు బొగ్గరపు తిరుపతయ్య, దొప్పలపూడి రవి, పెద్ద ప్రసాద్, ఎంపీపీలు పెయ్యల ఆదాం, దాసరి అశోక్ కుమార్, జడ్పీటీసీ సభ్యుడు గోళ్ళ రామకృష్ణ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రూరల్ మండల అధ్యక్షుడు మట్టా జాన్విక్టర్, పార్టీ నాయకులు పొట్లూరి వెంకట కృష్ణారావు, వల్లూరుపల్లి సుధాకర్, కసుకుర్తి బాబ్జి, కొల్లి విజయ్, పాలడుగు రాంప్రసాద్, గాదిరెడ్డి రామలింగారెడ్డి, మేకల సత్యనారాయణ, కొంకితల ఆంజనేయప్రసాద్, గిరిబాబాయ్, మూడెడ్ల ఉమా, చింతల భాస్కరరావు, వెంపటి సైమన్, కొలుసు నరేంద్ర, రేమల్లి పసి, సయ్యద్ గఫార్, ఆర్వీఎల్ నరసింహారావు, సర్దార్ బేగ్, యార్లగడ్డ సత్యభూషణ్, చుండి బాబి, పెద్ది కిషోర్, పొట్లూరి మురళీధర్, తోట రాజేష్, లోయ రాజేష్, గుత్తా నాని, పుల్లేటికుర్తి వినయ్, ఎస్కే బాజీ, అలీబేగ్, చింతాడ నాగూర్, మాదాసు వెంకటలక్ష్మి, మెండా చంద్రపాల్, జ్యోతుల సత్యవేణి తదితరులు పాల్గొన్నారు.

Comments