రాష్ట్రంలో సంపూర్ణ జినోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్రాష్ట్రంలో సంపూర్ణ జినోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్


అమరావతి (ప్రజా అమరావతి): విజయవాడ సిద్ధార్థ వైద్య కళాశాల ఆవరణలో సంపూర్ణ జినోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్  అందుబాటులోకొచ్చిందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కమీషనర్ కాటంనేని భాస్కర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 1 నుండి కార్యకలాపాలు ప్రారంభించిన ఈ ల్యాబ్ కోవిడ్ -19 కు సంబంధించిన డెల్టా, ఒమైక్రాస్ వంటి వేరియంట్లను, మ్యూటెంట్లను నిర్ధారించేందుకు వీలవుతుందని ఆయన వివరించారు. ఇటువంటి ల్యాబ్ రాష్ట్రంలో ఇదే మొదటిది కాగా, దేశంలో రెండవదని, మొదటి ల్యాబ్ కేరళలో వుందని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్వహణలో పనిచేసే ఈ ల్యాబ్ హైదరాబాద్ కు చెందిన సిఎస్ఐఆర్--సిసిఎంబి సాంకేతిక సహకారాన్ని అందిస్తుందని కమీషనర్ పేర్కొన్నారు. 

Comments