మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి రాకతో స్వగ్రామం బ్రాహ్మణపల్లిలో ముందే సంక్రాంతి సందడి *మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి రాకతో స్వగ్రామం బ్రాహ్మణపల్లిలో ముందే సంక్రాంతి సందడి**మంత్రి మేకపాటితో కలిసి బ్రాహ్మణపల్లిలోని సచివాలయ, రైతు భరోసా కేంద్రాలను పరిశీలించిన వైసీపీ సీనియర్ నాయకులు మేకపాటి రాజమోహన్ రెడ్డి*


*"మహాత్మాగాంధీ కలలు కన్న గ్రామస్వరాజ్యాన్ని నిజం చేసిన సీఎం" అంటూ ప్రశంసించిన మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి*


బ్రాహ్మణపల్లి, మర్రిపాడు,శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా (ప్రజా అమరావతి) : పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి తన స్వగ్రామం బ్రాహ్మణపల్లికి చేరుకున్నారు. ఆదివారం నెల్లూరు క్యాంపు కార్యాలయం నుంచి తండ్రిగారైన  వైసీపీ సీనియర్ నాయకులు రాజమోహన్ రెడ్డి, తల్లి మణిమంజరిగారితో పాటు సొంతూరు చేరారు. అక్కడ నియోజకవర్గ నాయకులు, సొంతూరు ప్రజలను ఆప్యాయంగా పలకరించారు. "అంతా బాగున్నారా" అంటూ గ్రామంలోని వ్యక్తుల పేర్లను గుర్తుపెట్టుకుని పలకరించారు మాజీ ఎంపీ మేకపాటి. స్థానికంగా ఏమైనా ఇబ్బందులు, సమస్యలు ఉన్నాయా అంటూ మంత్రి మేకపాటి గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. ఊళ్ళో పంటలు, రోడ్లు, నిర్మాణాలు, ఇతర అంశాలపై స్థానికులతో మాట్లాడారు. హైలెవల్ కెనాల్ పనుల పురోగతిపైనా మంత్రి స్థానిక నాయకులతో చర్చించారు.


రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఏర్పరిచిన గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం వ్యవస్థలను మేకపాటి రాజమోహన్ రెడ్డి సందర్శించారు. సీఎం జగన్ దార్శనికతను ఆయన కొనియాడారు. ప్రజల వద్దకే పరిపాలన మాటను ఆచరణలో చూపించిన ఆదర్శనీయ సీఎం జగన్ అంటూ ప్రశంసించారు. మిల్క్ చిల్లింగ్ సెంటర్, విలేజ్ హెల్త్ క్లినిక్,డిజిటల్ లైబ్రరీల  వంటివి కూడా నిర్మిస్తున్నట్లు మంత్రి మేకపాటి, మాజీ ఎంపీ రాజమోహన్ రెడ్డికి వివరించారు.  మహాత్మ గాంధీ ఆశించిన గ్రామ స్వరాజ్యాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు గ్రామగ్రామన కళ్లారా చూస్తున్నారన్నారు. ఎక్కడెక్కడో అధికారుల చుట్టూ ప్రజలు తిరగాల్సిన అవసరం లేకుండా అన్నీ ఇంటికే చేరవేయడం పాలనలో సరికొత్త ఒరవడి అని ఆయన అభిప్రాయపడ్డారు.


ఈ కార్యక్రమంలో మర్రిపాడు ఎంఆర్వో హమీద్, ఎంపీడీవో సుష్మితారెడ్డి, డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీ.ఐ వేణుగోపాల్ రెడ్డి, మర్రిపాడు, ఆత్మకూరు ఎస్.ఐలు, ఆత్మకూరు ఎంపీపీ కేతా వేణుగోపాల్ రెడ్డి,  జిల్లా వైసీపీ ప్రధాన కార్యదర్శి సుధాకర్ రెడ్డి, ఇతర వైసీపీ నాయకులు, బ్రాహ్మణపల్లి ప్రజలు పాల్గొన్నారు.