మంత్రి కొడాలి నాని గురించి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే నాలుక చీరే పరిస్థితి వస్తుంది

 


- మంత్రి కొడాలి నాని గురించి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే నాలుక చీరే పరిస్థితి వస్తుంది


- ఏం చేసినా చలామణి అవుతుందని అనుకోవద్దు

- వైసీపీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు మండలిగుడివాడ, జనవరి 25 (ప్రజా అమరావతి): రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) గురించి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే నాలుక చీరే పరిస్థితి వస్తుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు మండలి హనుమంతరావు హెచ్చరించారు. మంగళవారం గుడివాడ లింగవరం రోడ్డులోని కే కన్వెన్షన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ కోవర్టు బీజేపీలో కొనసాగుతున్నారని విమర్శించారు. నిజ నిర్ధారణ కమిటీ పేరుతో గుడివాడ వచ్చిన టీడీపీ నేతలు భంగపడ్డారని చెప్పారు. ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు గుడివాడ వచ్చేందుకు ప్రయత్నించారని, వచ్చి ఉంటే వీపులు పగిలి ఉండేవన్నారు. కే కన్వెన్షన్ ప్రాంగణం దరిదాపులకు వచ్చే హక్కు, రావాల్సిన అవసరం లేవన్నారు. ఒకవేళ ఏదైనా అసాంఘిక కార్యక్రమం జరిగివుంటే దానిపై ప్రభుత్వం, అధికార యంత్రాంగం విచారణ జరుపుతుందని తెలిపారు. రోజుకో తోక పార్టీ గుడివాడ వచ్చి అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నించడమే పనిగా పెట్టుకున్నాయన్నారు. అన్ని పార్టీలూ కలిసి వచ్చినా గుడివాడలో చేసేది, చేయగల్గింది ఏమీ ఉండదన్నారు. పిచ్చి వేషాలు వేస్తే పరిస్థితులు చేయి దాటతాయని, దానికి టీడీపీ, తోక పార్టీలే కారణమవుతాయన్నారు. విజయవాడలో గుట్కా, బ్లేడ్ బ్యాచ్ కు నాయకత్వం వహించి వారికి ఆశ్రయం కల్పిస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేసే వ్యక్తులు మంత్రి కొడాలి నాని గురించి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారన్నారు. కనకదుర్గమ్మ గుడి దగ్గర సైకిల్ బెల్లులు, కొబ్బరి చిప్పలు దొంగిలించి, పేదప్రజల రక్తాన్ని జలగలాగా పీల్చి కోటీశ్వరుడయ్యారన్నారు. గత చరిత్రను మరిచి మంత్రి కొడాలి నాని గురించి మాట్లాడితే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. టీడీపీ అధికారంలో ఉండగా ఒకసారి గుడివాడ వచ్చి పోలీసుల అండతో పత్రికా సమావేశం నిర్వహించి పారిపోయిన విషయాన్ని గుర్తుచేశారు. చంద్రబాబు ఇంటి దగ్గరకు వెళ్తే మంత్రి కొడాలి నానిని ఏదో చేస్తానని ప్రగల్భాలు పలుకుతున్నాడన్నారు. దమ్ము, ధైర్యం ఉంటే, మగాడివైతే ముందు గుడివాడ రావాలని, నీ సంగతేంటో తేలుస్తామని చెప్పారు. విజయవాడ నుండి బయలుదేరే ముందే పోలీసులకు ఫోన్ చేసి బందోబస్తు పటిష్ఠంగా ఏర్పాటు చేయాలని బతిమలాడుకుని గుడివాడ వస్తున్నారన్నారు. గుడివాడలో దిగీదిగగానే అరెస్ట్ చేయాలని అడుక్కునే మీరు మంత్రి కొడాలి నానిని ఏం చేయగలరని ప్రశ్నించారు. ఏం చేసినా చలామణి అవుతుందని అనుకోవద్దన్నారు. గుడివాడలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సామాన్య కార్యకర్తలపై చేయి వేసే దమ్ము కూడా లేదన్నారు. దమ్ము, ధైర్యం, సిగ్గు, శరం లేక బీజేపీని కూడా తెచ్చుకుని గుడివాడలో అల్లరి చేయాలని ప్రయత్నిస్తున్నారన్నారు. మాకు ఏ పార్టీ అయినా ఒకటేనని, అరాచకాలు, పిచ్చి వేషాలతో గుడివాడలో అశాంతిని సృష్టిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేయాలని ప్రయత్నిస్తే తిరగబడతారని మండలి హెచ్చరించారు. ఈ సమావేశంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రూరల్ మండల అధ్యక్షుడు మట్టా జాన్విక్టర్, నాయకులు లోయ రాజేష్, తోట నాగరాజు, గూడపాటి వెంకటేశ్వరరావు, వెంపటి సైమన్, చింతల భాస్కరరావు, కొంకితల ఆంజనేయప్రసాద్, రేమల్లి పసి, మేకల సత్యనారాయణ, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Comments