వైకుంఠ ఏకాదశి సందర్భంగా వేడుకగా స్వర్ణరథోత్సవం
తిరుమల, 13 జనవరి (ప్రజా అమరావతి): తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని గురువారం స్వర్ణరథోత్సవం వేడుకగా జరిగింది.
సర్వాంగ సుందరంగా అలంకరించిన స్వర్ణరథాన్ని 200 మంది టీటీడీ మహిళా ఉద్యోగులతో పాటు పలువురు మహిళలు గోవిందనామస్మరణతో భక్తిశ్రద్ధలతో లాగారు. స్వర్ణరథోత్సవాన్ని గ్యాలరీల్లో వేచి ఉన్న భక్తులు దర్శించుకున్నారు.
భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ, టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి, ఈఓ డాక్టర్ కెఎస్.జవహర్ రెడ్డి, అదనపు ఈఓ శ్రీ ఎవి.ధర్మారెడ్డి, సివిఎస్వో శ్రీ గోపీనాథ్ జెట్టి, సిఇ శ్రీ నాగేశ్వరరావు, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ శ్రీదేవి, వెల్ఫేర్ డిప్యూటీ ఈఓ శ్రీ దామోదర్ తదితరులు పాల్గొన్నారు.
కాగా, వైకుంఠ ఏకాదశి నాడు ఉదయం ఏడున్నర గంటలకు సాధారణ భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం ప్రారంభమైంది.
addComments
Post a Comment