శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి,

 శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి, విజయవాడ (ప్రజా అమరావతి);


శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి, విజయవాడ అభివృద్ది పనులలో భాగముగా దుర్గాఘాట్ నందు  కేశఖండన శాల నిర్మాణము, సీతమ్మవారి పాదాల వద్ద పార్కింగ్ నిమిత్తము ఇరిగేషన్ డిపార్టుమెంట్ వారికి సంబందించిన స్థలమును ఈ దేవస్థానమునకు ఇచ్చుటకు గాను తేది:24-01-2022 న ఇరిగేషన్ క్యాంప్ ఆఫీసు నందు గౌరవ ఇరిగేషన్ శాఖ మంత్రివర్యులు అనీల్ కుమార్ యాదవ్ గారితో దేవదాయ ధర్మదాయ శాఖ, ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు శ్రీ వెలంపల్లి శ్రీనివాసరావు గారు సంబందిత డిపార్టుమెంట్ అధికారులు తో చర్చించుట జరిగినది. ఈసందర్బముగా దుర్గా ఘాట్ నందు ఇరిగేషన్ వారికి సంబందించిన స్థలములో భక్తుల సౌకర్యార్ధం కేశఖండన శాల మరియు మరుగుదొడ్ల నిర్మాణము నిమిత్తం తాత్కాలిక కట్టడములు చేసుకొనుటకు,  అదే విధముగా సీతమ్మ వారిపాదాలు వద్ద దసరా మరియు భవానీ దీక్షల విరమణలలో వినియోగించుచున్న ఇరిగేషన్  స్థలము నందు కూడా భక్తుల సౌకర్యార్ధము పార్కింగ్ మరియు తాత్కాలిక మరుగుదొడ్ల ఏర్పాటు  విషయములో సంబందిత ఇంజనీరింగ్ అధికారులు కలసి జాయింట్ ఇనస్పెక్షన్ చేసి నివేదిక ఇవ్వవలసినదిగా ఆదేశించియున్నారు. ఈ సమావేశము నందు గౌరవ ఇరిగేషన్ శాఖ ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్యులు అనీల్ కుమార్ యాదవ్ గారితో పాటు  దేవదాయ ధర్మదాయ శాఖ, ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు శ్రీ వెలంపల్లి శ్రీనివాసరావు మరియు శ్రీమతి డి.భ్రమరాంబ, దేవస్థాన కార్యనిర్వహాణాధికారి వారు, శ్రీ సి.నారాయణ రెడ్డి, ఇంజనీర్-ఇన్-చీఫ్, శ్రీ కె.రాంమోహన్ రావు, ఓ.ఎస్.డి, శ్రీ ఎ.రాజ స్వరూప్ కుమార్,   కార్యనిర్వహక ఇంజనీరు, ఇరిగేషన్ డిపార్టుమెంట్ మరియు దేవస్థాన అధికారులు శ్రీ ఎ.ఉదయ్ కుమార్, అడ్జైజర్, శ్రీ కె.వి.ఎస్.ఆర్.కోటేశ్వర రావు , కార్యనిర్వహక ఇంజనీరు, శ్రీమతి ఎల్.రమ, కార్యనిర్వహక ఇంజనీరు మరియు శ్రీ బి.వెంకట రెడ్డి, ఏ.ఇ.ఓ. వారు సమావేశములో పాల్గొనియున్నారు.

Comments