క్రీడా మైదానాల నిర్మాణాలకు ప్రాధాన్యత ఇవ్వండి
*అధికారులను ఆదేశించిన జేసీ సిరి*
అనంతపురము, జనవరి 05 (ప్రజా అమరావతి);
ఉపాధి హామీ మెటీరియల్ కాంపోనెంట్ నిధుల వినియోగంలో క్రీడా మైదానాల నిర్మాణాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సంబంధిత అధికారులను జాయింట్ కలెక్టర్ ఏ.సిరి అదేశించారు.
బుధవారం తన క్యాంపు కార్యాలయంలో జిల్లాలోని క్రీడా మైదానాల నిర్మాణ పనులపై జాయింట్ కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ 2021-22 ఆర్థిక సంవత్సరంలో మంజూరైన క్రీడా మైదానాల నిర్మాణ పనులను వేగవంతం చేయడంతో పాటూ, వచ్చే ఆర్థిక సంవత్సరానికి నిర్మించదలచిన మైదానాలను గుర్తించాలన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో వాకింగ్ ట్రాకులు, అరోగ్యాభిలాషుల కోసం సమాంతర మరియు నిలువు బార్లు, ఓపెన్ జిమ్ములు ఏర్పాటు చేయాలని ఇదివరకే అదేశాలిచ్చామని, అయితే సాంకేతిక కారణాల వల్ల ఓపెన్ జిమ్ ల నిర్మాణాలు ఉపాధి హామీ నిధుల కింద చేపట్టే పరిస్థితి లేనందున ఇతర పనులపై దృష్టి సారించాలన్నారు.
ఈ కార్యక్రమానికి జిల్లా స్పోర్ట్స్ అథారిటీ సీఈవోగా వ్యవహరిస్తున్న హౌసింగ్ పీడీ కేశవ నాయుడు, జిల్లా చీఫ్ కోచ్ జగన్నాథ రెడ్డి, డ్వామా పీడీ వేణు గోపాల్ రెడ్డి, పంచాయతీ రాజ్ ఎస్.ఈ భాగ్యరాజ్, ఆర్డబ్ల్యూఎస్ ఎస్.ఈ వెంకట రమణ, డీఈవో శామ్యూల్, సమగ్ర శిక్ష అభియాన్ ఈఈ శివకుమార్, మైనర్ ఇరిగేషన్ ఎస్.ఈ సుధాకర్, పబ్లిక్ హెల్త్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment