పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన శ్రీ ప్రసన్న వెంకటేష్ .


 ఏలూరు (ప్రజా అమరావతి);

    పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన శ్రీ ప్రసన్న వెంకటేష్ .


      బుధవారం కలెక్టరేట్లోని ఆయన చాంబర్ లో బాధ్యతలు  తీసుకున్నారు .

 ఈ సందర్భంగా  జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా అభివృద్ధికి   కృషి చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. గ్రీవెన్స్  పరిస్కారం,   గ్రామ ,వార్డు సచివాలయం ద్వారా ప్రతి ఇంటికి  సేవలు దించేందుకు కృషి చేస్తానని అన్నారు.  నవరత్నాలు , సంక్షేమ కార్యక్రమాలు ,  రైతుల సంక్షేమం ,  ధాన్యం కొనుగోలు ,  ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాలలో మౌలిక సదుపాయాల అభివృద్ధి ,  కోవిడ్ మేనేజ్మెంట్ ,   వ్యాక్సినేషన్ , ఇన్ఫ్రాస్ట్రక్చర్  , గృహ నిర్మాణం  పేదలందరికి  ఇళ్లు , స్మార్ట్ టౌన్ షిప్,  గ్రామీణ  ,పట్టణ ప్రాంతాల్లో పారిశుద్ధ్య కార్యక్రమా లు ప్రధాన్యతా అంశాలని వీటిపై ఎక్కువ దృష్టి పెట్టడం జరుగుతుందని ఆయన తెలిపారు.

    ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్  శ్రీ హిమాన్సు  శుక్లా , జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ , జయింట్ కలెక్టర్ శ్రీమతి  పి. పద్మావతి ,అసిస్టెంట్  కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి, డి ఆర్ ఓ వి దేవిడ్ రాజు ,ఏలూరు ఆర్డీవో పనబాక రచన, హౌసింగ్ పి డి వేణుగోపాల్  తదితరులు పాల్గొన్నారు .


Comments