ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సక్రమంగా అమలు అయ్యేలా చర్యలు తీసుకోవాలి



*ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ  సక్రమంగా అమలు అయ్యేలా చర్యలు తీసుకోవాలి



*


*ప్రైవేట్ ఆస్పత్రుల్లో కోవిడ్‌ బాధితుల నుండి అధిక ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకోండి*


*ప్రైవేట్‌ ఆసుపత్రులలో  రోగుల చికిత్స కు సంబంధించిన ఫీజుల వివరాలు బోర్డుల్లో ప్రదర్శించేలా చర్యలు చేపట్టాలి*


*అర్హులైన పేదలకు నవరత్నాలు పేదలందరికీ ఇళ్లుపథకం కింద ఇంటి పట్టా మంజూరుకు అవసరమైన చోట భూసేకరణ చేయండి*


*రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి మరియు జిల్లా ఇంఛార్జి మంత్రి డాక్టర్ పి.అనిల్ కుమార్*


*కరోనా వైరస్‌ ఒమిక్రాన్‌ వేరియంట్‌ పై ప్రజలను అప్రమత్తం చేయండి*


*ప్రైవేట్ ఆస్పత్రులు ప్రజల పట్ల  అన్యాయంగా వ్యవహరించకుండా పర్యవేక్షణ కమిటీలను ఏర్పాటు చేయాలి*


*జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని లబ్ధిదారులకు విస్తృత అవగాహన కల్పించండి*


*గ్రామ,వార్డ్ సచివాలయాల సిబ్బంది స్థానికంగా నివాసం అంశంపై మ్యాపింగ్ చేయండి*

*రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ :-*


*కోవిడ్ - 19 థర్డ్ వేవ్ సంసిద్ధత, హౌసింగ్, జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం, నవరత్నాలు - పేదలందరికీ ఇళ్లు పథకం కింద 90 రోజుల్లో ఇంటి పట్టా  మంజూరు కార్యక్రమం,  గ్రామ, వార్డు సచివాలయాల పై డిఆర్ సిలో సుదీర్ఘ చర్చ :-*


కర్నూలు, జనవరి 06 (ప్రజా అమరావతి):-*

ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ  సక్రమంగా అమలు అయ్యేలా చర్యలు తీసుకోవాలనిరాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి మరియు జిల్లా ఇంఛార్జి మంత్రి డాక్టర్ పి.అనిల్ కుమార్ ఆదేశించారు


*గురువారం స్థానిక కలెక్టరేట్ సునయన అడిటోరియంలో కోవిడ్ - 19 థర్డ్ వేవ్ సంసిద్ధత, జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం, నవరత్నాలు - పేదలందరికీ ఇళ్లు పథకం కింద 90 రోజుల్లో ఇంటి పట్టా మంజూరు, గ్రామ, వార్డు సచివాలయాల పనితీరు, ఇరిగేషన్ అంశాలపై రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి మరియు జిల్లా ఇంఛార్జి మంత్రి అధ్యక్షతన జిల్లా సమీక్షమండలి సమావేశం జరిగింది


*ఈ సమావేశంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం, ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి, జడ్పీ చైర్మన్ ఎర్రపోతుల పాపిరెడ్డి, కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్, నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్సీ చల్లా భగీరథ రెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్ భాషా, పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి, ఆదోని ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి, మంత్రాలయం ఎమ్మెల్యే బాల నాగిరెడ్డి, కోడుమూరు ఎమ్మెల్యే డాక్టర్ జె సుధాకర్, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే బిజేంద్ర నాథ్ రెడ్డి, నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, పత్తికొండ ఎమ్మెల్యే కే శ్రీదేవి, జిల్లా ఎస్పీ సిహెచ్ సుధీర్ కుమార్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) డా.మనజీర్ జిలానీ సామూన్, జాయింట్ కలెక్టర్ (రెవిన్యూ మరియు రైతు భరోసా) రామ సుందర్ రెడ్డి, కర్నూలు నగర పాలక సంస్థ కమిషనర్ డీ.కే.బాలాజీ, శ్రీశైలం ప్రాజెక్ట్ స్పెషల్  కలెక్టర్ తమిమ్ అన్సారీయ, జాయింట్ కలెక్టర్ (హౌసింగ్) నారపురెడ్డి మౌర్య, జాయింట్ కలెక్టర్ (ఆసరా మరియు సంక్షేమం) ఎం.కె.వి శ్రీనివాసులు, నంద్యాల సబ్ కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్, డిసిఎంపియు చైర్మన్ ఎస్ వి జగన్ మోహన్ రెడ్డి, నంద్యాల పురపాలక సంఘం చైర్ పర్సన్ షేక్ మబునిషా, జిల్లా అధికారులు, పాల్గొన్నారు.


*తొలుత కోవిడ్ - 19 థర్డ్ వేవ్ సంసిద్ధత అంశంపై చర్చలో భాగంగా రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి మరియు జిల్లా ఇంఛార్జి మంత్రి   మాట్లాడుతూ  కోవిడ్ మహమ్మారి కట్టడికి అధికారులు అందరూ సమన్వయంతో పని చేయాలన్నారు.. ప్రైవేట్‌ ఆసుపత్రులలో  కోవిడ్ - 19 చికిత్స కు ప్రభుత్వం ఫీజులు నిర్ణయించిందన్నారు.. మొదటి, రెండో వేవ్ లో కోవిడ్‌ వ్యాధిగ్రస్తుల నుండి నిబంధనలకు విరుద్ధంగా అధిక ఫీజులు వసూలు చేసినట్లు ఫిర్యాదులు వచ్చాయని, అటువంటి పొరపాటు ఇప్పుడు జరగకుండా, అన్ని ప్రైవేట్  ఆసుపత్రులలో ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులనే వసూలు చేసేలా చర్యలు చేపట్టాలని జిల్లా ఇన్చార్జి మంత్రి అధికారులను ఆదేశించారు. కోవిడ్ సమయంలో  ప్రైవేట్ హాస్పిటల్స్ మానవత్వంతో వ్యవహారించాలన్నారు....ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ  సక్రమంగా అమలు అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు..  ప్రభుత్వ నిబంధనల మేరకు పేదలందరికీ ఆరోగ్య శ్రీ కింద ఉచితంగా  వైద్యం  అందించాలన్నారు.. ఆరోగ్యశ్రీ అమలవుతున్న ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ కింద ఫీజులు వసూలు చేస్తే చర్యలు తీసుకోవాలని  మంత్రి ఆదేశించారు. ఆరోగ్యశ్రీ కింద ఫీజులు వసూలు చేస్తుంటే ఎలాంటి చర్యలు తీసుకున్నారు అని ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ ను జిల్లా ఇన్చార్జి మంత్రి ప్రశ్నించారు. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రుల్లో  50 శాతం బెడ్స్ ఆరోగ్యశ్రీకి కేటాయించేలా చర్యలు చేపట్టాలన్నారు.ట్రైబల్ ఏరియాలో  ఉన్న ఆస్పత్రుల్లో డాక్టర్లు లేకపోతే వెంటనే నియమించాలని  కలెక్టర్ ను జిల్లా ఇన్చార్జి మంత్రి ఆదేశించారు.  వైద్య ఆరోగ్య శాఖ కు సంబంధించి, ఉద్యోగాల భర్తీలో పారదర్శకంగా నియామకాలు చేపట్టాలని, కర్నూలు, పాణ్యం ఎమ్మెల్యేలు సూచించిన ప్రకారం రిక్రూట్మెంట్ లో ఏమైనా పొరపాటు జరిగి ఉంటే మరొకసారి వెరిఫై చేయాలని కలెక్టర్ ను జిల్లా ఇంచార్జ్ మంత్రి ఆదేశించారు.మెరిట్ ప్రకారం నియామకాలు జరిగేలా చూడాలని మంత్రి ఆదేశించారు. 


జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం సంబంధించి జిల్లాలో ఎంత మంది లబ్ధిదారులు ఉన్నారు, ఎంతమంది రుణ విముక్తి పత్రాలు పొందారు, ఎంతమంది రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు వంటి వివరాలను జాయింట్ కలెక్టర్ హౌసింగ్) అడిగి తెలుసుకొని ఈ పథకంపై లబ్ధిదారులకు మరింత అవగాహన కల్పించాలని ఆదేశించారు. చాలామంది పేదలు ప్రభుత్వం నుంచి గతంలో ఇల్లు పొందినా... ఇప్పటి వరకు వాటికీ సంబంధించి అధికారికంగా ఎటువంటి హక్కులు లేవని, ఆ ఇంటి మీద అవసరానికి ఒక్క రూపాయి కూడా అప్పు తెచ్చుకోలేక పోతున్నారని, ఇలాంటి ఇబ్బందుల నుంచి లబ్ధిదారులకు విముక్తి కల్పించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దేశమన్నారు. ఈ పథకం లబ్ధిదారులు సద్వినియోగం చేసుకునేలా క్షేత్ర స్థాయిలో విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. కేసీ కెనాల్, తెలుగుగంగ ఆయకట్టులో ప్రస్తుతం సాగులో ఉన్న పంటలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు .బనగానపల్లి, ఆవుకు, నంద్యాల, ఆళ్లగడ్డ నియోజకవర్గాల్లో భూ సేకరణ చేసి అర్హులైన పేదలకు  నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు పథకం కింద ఇంటి పట్టాల మంజూరుకు కృషి చేయాలని అధికారులను జిల్లా ఇన్చార్జి మంత్రి ఆదేశించారు. గ్రామ,వార్డ్ సచివాలయాల్లో  ప్రజలకు జవాబుదారీ తనంతో  సేవలు అందించేలా పర్యవేక్షణ చేయాలని మంత్రి సూచించారు. జిల్లా సమీక్షసమావేశంలో ప్రజా ప్రతినిధులు లేవనెత్తిన సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు .

Comments