*కోవిడ్ మహమ్మారి కట్టడికి అన్ని విధాలా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలి*
*ఎలాంటి పరిస్థితులు తలెత్తినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి -*
*ప్రణాళికా బద్ధంగా ప్రభుత్వ మరియు ప్రైవేట్ కోవిడ్ హాస్పిటల్లో అన్ని వసతులను ఏర్పాటు చేయాలి*
*కాంటాక్ట్ ట్రేసింగ్, శాంపుల్ కలెక్షన్ ,టెస్టింగ్, ట్రీట్మెంట్ లపై ప్రత్యేక దృష్టి సారించాలి*
*క్రమం తప్పకుండా ఇంటింటా ఫీవర్ సర్వే జరగాలి*
*కోవిడ్ లక్షణాలు ఉన్న వారిని గుర్తించి వెంటనే నిర్ధారణ పరీక్షలు చేయండి*
*పాజిటివ్ అని తేలితే వెంటనే ప్రైమరీ కాంటాక్ట్స్‌కు పరీక్షలు చేయాలి*
*కోవిడ్ కేర్ సెంటర్ లో అన్ని ఏర్పాట్లను సత్వరమే పూర్తి చేయండి*
*వైద్యపరంగా కావలసిన మందులన్నీ అందుబాటులో ఉంచుకోవాలి*
*అధికారులందరూ సమన్వయంతో పని చేయాలి*
*కోవిడ్ నోడల్ ఆఫీసర్లను ఆదేశించిన జిల్లా కలెక్టర్ పి. కోటేశ్వర రావు*
*కర్నూలు, జనవరి 05 (ప్రజా అమరావతి) :-*కోవిడ్ మహమ్మారి కట్టడికి అన్ని విధాలా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుని, ఎలాంటి పరిస్థితులు తలెత్తినా ఎదుర్కొనేలా సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ పి కోటేశ్వరరావు అధికారులను ఆదేశించారు.
కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో కోవిడ్ - 19 పై సంబంధిత కోవిడ్ నోడల్ ఆఫీసర్లతో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ....థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో అధికారులందరూ సమన్వయంతో కరోనా కట్టడికి కృషి చేయాలన్నారు. ఒకవేళ థర్డ్ వేవ్ వస్తే జిజిహెచ్ హాస్పిటల్ కు కోవిడ్ రోగుల అడ్మిషన్స్ పెరిగితే కోవిడ్ బాధితులకు మెరుగైన వైద్యం అందించేందుకు సరిపడినంత వైద్యులు, ఆక్సిజన్ బెడ్స్,ఐసియు బెడ్స్, నాన్ ఐసియు బెడ్స్ ఏర్పాటు,తదితర అంశాలన్నీ యాక్షన్ ప్లాన్ ప్రకారం సిద్ధం చేసుకోవాలని జిజి హెచ్ సూపరింటెండెంట్ నరేంద్రనాద్ రెడ్డిని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో ఉన్న 23 కోవిడ్ ప్రభుత్వ ఆసుపత్రులు, 36 కోవిడ్ ప్రైవేట్ హాస్పిటల్ లో ఎన్ని పి ఎస్ ఏ ప్లాంట్ లు ఉన్నాయి, పి ఎస్ ఎ ప్లాంట్ లు సిద్ధంగా ఉన్నాయా లేదా ఒకసారి చెక్ చేయాలని సంబంధిత నోడల్ ఆఫీసర్ ను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ప్రైవేట్ హాస్పిటల్ లో ఐసియు బెడ్స్, నాన్ ఐసియు బెడ్స్ ఎన్ని అందుబాటులో ఉన్నాయి తదితర వివరాలన్నీ హాస్పిటల్ నోడల్ ఆఫీసర్ నుంచి రిపోర్టు తెప్పించుకొని ఒకవేళ ఏమైనా లోపాలు ఉంటే వెంటనే సవరించేలా చర్యలు చేపట్టాలని హాస్పిటల్ మేనేజ్మెంట్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ ఇలియాజ్ ను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ నెల ఏడో తేదీ లోపు ప్రభుత్వ మరియు ప్రైవేట్ హాస్పిటల్ లో కోవిడ్ బాధితులకు అందాల్సిన పూర్తి వైద్య సేవలకు సంబంధించి యాక్షన్ ప్లాన్ సమర్పించాలని డాక్టర్ ఇలియాజ్ ను జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
కోవిడ్ బాధితులకు అందాల్సిన ప్రాణవాయువుకు సంబంధించి జిల్లాలో సిలిండర్ లకు ఆక్సిజన్ రీఫిల్లింగ్ పై పూర్తి వివరాలతో యాక్షన్ ప్లాన్ తయారు చేయాలని డ్రగ్ కంట్రోలర్ అసిస్టెంట్ డైరెక్టర్ ను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. సెంట్రల్ డ్రగ్ స్టోర్ లో మాస్క్ లు, శానిటైజర్ లు, ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లు, డీటైప్ సిలెండర్లు, మందులు తగినన్ని నిల్వ ఉంచుకునేలా చర్యలు చేపట్టాలని ఏపీఎంఎస్ ఐడిసి ఈఈను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. క్రమం తప్పకుండా ఇంటింటా ఫీవర్ సర్వే తప్పనిసరిగా చేయాలని జిల్లా కలెక్టర్ సంబంధిత కోవిడ్ నోడల్ ఆఫీసర్ ను ఆదేశించారు. కోవిడ్ లక్షణాలు ఉన్న వారిని వెంటనే గుర్తించి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయాలని, పాజిటివ్ అని తేలితే ప్రైమరీ కాంటాక్ట్స్‌కు పరీక్షలు చేయాలని ఆదేశించారు. కాంటాక్ట్ ట్రేసింగ్, టెస్టింగ్, ట్రీట్మెంట్ లపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.
హోమ్ ఐసోలేషన్ లో ఉన్న పేషెంట్లకు మెడికల్ కిట్ ఇవ్వాలన్నారు. పాజిటివ్ కేసు నమోదైతే హోమ్ ఐసోలేషన్ లో ఉండేటట్లు చూసి ఆశా, ఏఎన్ఎం, మెడికల్ ఆఫీసర్ విజిట్ చేసి వారి ఆరోగ్య స్థితి గతులపై పర్యవేక్షించాలన్నారు. హోమ్ ఐసోలేషన్ లో ఉండేందుకు వసతులు లేని పక్షంలో వారిని వెంటనే కోవిడ్ కేర్ హాస్పిటల్ తరలించాలన్నారు. కోవిడ్ కేర్ సెంటర్లలో టాయిలెట్స్, ఫ్యాన్లు, వాటర్, కరెంట్ తదితర సౌకర్యాలను కల్పించాలన్నారు. కరోనా బాధితులకు మెరుగైన వైద్య చికిత్సలు అందించేందుకు పల్స్ ఆక్సి మీటర్, మాస్కులు, శానిటైజర్, పీపీఈ కిట్, మెడిసిన్స్, గ్లౌజ్ లు తదితర మెడికల్ సామాగ్రి పరికరాలను సిద్ధం చేసుకోవాలన్నారు.
వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా 15 సంవత్సరాలు నిండి 18 సంవత్సరాల లోపు 2.39 లక్షల మంది పిల్లలు ఉండగా ఈ రోజు ఉదయానికి తొంబై వేల మంది పిల్లలకు మొదటి డోసు వ్యాక్సిన్ ఇచ్చామని, ఇంకా మిగిలిన పిల్లలకు వ్యాక్సిన్ ఇచ్చే ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. రెండో డోసుకు సంబంధించి 78% వ్యాక్సిన్ ఇచ్చామని, మిగిలిన వాళ్ళకు కూడా వ్యాక్సిన్ ఇచ్చేందుకు చర్యలు చేపట్టాలని వ్యాక్సినేషన్ నోడల్ ఆఫీసర్ డి ఐ ఓను జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
సమీక్షలో జాయింట్ కలెక్టర్ డా.మనజీర్ జిలానీ సామూన్, జాయింట్ కలెక్టర్ (రెవిన్యూ మరియు రైతు భరోసా) రామ సుందర్ రెడ్డి, కర్నూలు నగర పాలక సంస్థ కమిషనర్ డి.కె.బాలాజీ, జాయింట్ కలెక్టర్ (హౌసింగ్) నారపురెడ్డి మౌర్య, జాయింట్ కలెక్టర్ (ఆసరా మరియు సంక్షేమం) ఎం.కె.వి శ్రీనివాసులు, నంద్యాల సబ్ కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్, అడిషనల్ ఎస్పీ రమణ, డిఆర్ ఓ పుల్లయ్య, కోవిడ్ నోడల్ ఆఫీసర్లు, పాల్గొన్నారు.
addComments
Post a Comment