జగనన్న స్మార్ట్ టౌన్ షిప్ ప్రారంభం

 జగనన్న స్మార్ట్ టౌన్ షిప్ ప్రారంభం


*


*: ధర్మవరంకు సంబంధించి 120 ఎకరాల్లో 1,272 ప్లాట్లతో జగనన్న స్మార్ట్ టౌన్ షిప్ లేఔట్ ఏర్పాటు*


*: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వివరించిన జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి*


 ధర్మవరం, జనవరి 11 (ప్రజా అమరావతి);


తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి మధ్యతరగతి ప్రజలకు సొంతింటి కల నెరవేర్చేందుకోసం ఏర్పాటు చేసిన జగనన్న స్మార్ట్ టౌన్ షిప్స్ పథకాన్ని గౌ. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు.


ధర్మవరం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో ప్రభుత్వ శాసనమండలి విప్ వెన్నపూస గోపాల్ రెడ్డి, హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్, జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి, ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట రామిరెడ్డి, జడ్పి చైర్మన్ బోయ గిరిజమ్మ, అహుడా చైర్మన్ మహాలక్ష్మి శ్రీనివాస్, రాష్ట్ర వక్కలిగ కార్పొరేషన్ చైర్మన్ నళిని, రాష్ట్ర నాటక అకాడమీ చైర్మన్ హరిత, జాయింట్ కలెక్టర్ (ఆసరా) గంగాధర్ గౌడ్, అహుడా వైస్ చైర్మన్ మురళీకృష్ణ, ఆర్టీసీ రీజనల్ డైరెక్టర్ మంజుల, తదితరులు పాల్గొన్నారు.


ధర్మవరం పట్టణానికి సంబంధించి 120 ఎకరాల్లో 1,272 ప్లాట్లతో జగనన్న స్మార్ట్ టౌన్ షిప్ లేఔట్ ఏర్పాటు : రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వివరించిన జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి.


ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో జిల్లా కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలో ముందుగా ధర్మవరం పట్టణంలో జగనన్న స్మార్ట్ టౌన్ షిప్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. ధర్మవరం వద్ద 120 ఎకరాలను రైతుల నుంచి తీసుకోవడం జరిగిందని, ఇందులో అసైన్మెంట్ భూములకు సంబంధించి 25 లక్షల రూపాయలు పరిహారం అందించి భూములు తీసుకోవడం జరిగిందన్నారు. ధర్మవరం పట్టణానికి సంబంధించి 120 ఎకరాల్లో 1,272 ప్లాట్లతో జగనన్న స్మార్ట్ టౌన్ షిప్ లేఔట్ ను ఏర్పాటు చేశామన్నారు. జగనన్న స్మార్ట్ టౌన్ షిప్ లో మౌలిక సదుపాయాలు, ఇతర వసతుల కల్పనకు 60 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు తెలిపారు. ఇందులో స్క్వయర్ ఫీట్ కు ధరను చాలా తక్కువగా, అందరికీ అందుబాటులో ఉండేలా నిర్ణయించడం జరిగిందని, స్క్వయర్ యార్డ్ కు 5,999 రూపాయల ధర నిర్ణయించామని, బయట మార్కెట్ ధరలతో పోలిస్తే జగనన్న స్మార్ట్ టౌన్ షిప్ లో ధరలు దాదాపు 40 నుంచి 50 శాతం తక్కువగా ఉండనున్నాయన్నారు. లేఔట్ ధర్మవరానికి దగ్గరగా ఉంటుందని, బస్టాండ్ ప్రాంతానికి, రైల్వేస్టేషన్ ప్రాంతానికి లేఔట్ ఐదు నుంచి ఆరు కిలోమీటర్లలోపే ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం జగనన్న స్మార్ట్ టౌన్ షిప్ వెబ్ సైట్ ప్రారంభించగానే 140 మందికి పైగా లబ్ధిదారులు ప్లాట్ రిజిస్టర్ చేసేందుకు, ఇందులో 30 మంది లబ్దిదారులకు పూర్తిస్థాయి డబ్బులు కట్టి 5 శాతం రిబేట్ పొందేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. జిల్లాలో ఇతర నియోజకవర్గాలలో జగనన్న స్మార్ట్ టౌన్ షిప్స్ ఏర్పాటు చేసేందుకోసం అనంతపురం, పెనుకొండ పట్టణాలకు సంబంధించి భూమి సేకరణ ప్రక్రియ తుది దశలో ఉందన్నారు. ఇతర నియోజకవర్గాల్లో కూడా భూసేకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేస్తామన్నారు. ధర్మవరం నియోజకవర్గంలో నవరత్నాలు పేదలందరికీ ఇల్లు కింద 14,400 మందికి ఇంటి పట్టాలు ఇవ్వడం జరిగిందని, ఇళ్ల నిర్మాణాలకు కూడా అనుమతి ఇవ్వడం జరిగిందన్నారు. మధ్యతరగతి కుటుంబాల సొంతింటి కల జగనన్న స్మార్ట్ టౌన్ షిప్స్ ఏర్పాటు ద్వారా నెరవేరే అవకాశం ఉందని, లబ్ధిదారుల తరపున రాష్ట్ర ముఖ్యమంత్రికి జిల్లా కలెక్టర్ కృతజ్ఞతలు తెలిపారు.


ఈ సందర్భంగా హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ మాట్లాడుతూ జగనన్న స్మార్ట్ టౌన్ షిప్స్ ఏర్పాటు ద్వారా మధ్య తరగతి కుటుంబాల వారికి ఇల్లు కట్టుకోవాలంటే సొంతింటి కలను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నెరవేర్చడం జరిగిందన్నారు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకు వెళ్తున్నట్లు తెలిపారు. ఎలాంటి లీగల్ సమస్యలు లేకుండా బ్రహ్మాండమైన వాతావరణంలో జగనన్న స్మార్ట్ టౌన్ షిప్స్ నిర్మించడం జరుగుతుందన్నారు. మధ్యతరగతి ప్రజల కలను నెరవేర్చిన రాష్ట్ర ముఖ్యమంత్రికి ఎంపీ కృతజ్ఞతలు తెలిపారు.


ఈ సందర్భంగా ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట రామిరెడ్డి మాట్లాడుతూ ఒక్క రూపాయి లాభం లేకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జగనన్న స్మార్ట్ టౌన్ షిప్స్ ను ఏర్పాటు చేస్తున్నారన్నారు. దీనితో మధ్యతరగతి ప్రజల సొంత ఇంటి కల నెరవేరుతుందని, జగనన్న స్మార్ట్ టౌన్ షిప్స్ లో ప్రభుత్వ ఉద్యోగులకు కూడా 10 శాతం ప్లాట్లు కేటాయించి 20 శాతం సబ్సిడీ ఇవ్వడం జరుగుతుందన్నారు. భవిష్యత్తులో ఈ కార్యక్రమం ఎంతగానో లబ్ధిదారులకు ఉపయోగపడుతుందన్నారు. జగనన్న స్మార్ట్ టౌన్ షిప్స్ ను మధ్యతరగతి ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.


ఈ సందర్భంగా జగనన్న స్మార్ట్ టౌన్ షిప్ బ్రోచర్ ను విప్, ఎంపీ, జిల్లా కలెక్టర్, జడ్పి చైర్మన్, ఎమ్మెల్యే తదితరులు ఆవిష్కరించారు.


ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ లింగం నిర్మల, మున్సిపల్ వైస్ చైర్మన్ లు సాయికుమార్, చందమూరి నారాయణ రెడ్డి, ఆర్డిఓ వరప్రసాద్, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున, తహసీల్దార్ నీలకంఠా రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు.