కాకాణి చేతులు మీదుగా దివ్యాంగుల జాబ్ మేళా ప్రారంభం"

 *"కాకాణి చేతులు మీదుగా దివ్యాంగుల జాబ్ మేళా ప్రారంభం"*




శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గం, వెంకటాచలం మండలంలోని  "దివ్యాంగుల సంయుక్త ప్రాంతీయ కేంద్రం" 6వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన జాబ్ మేళాను ప్రారంభించి, దివ్యాంగులకు అవసరమైన పరికరాల కిట్లు, వినికిడి యంత్రాలు అందజేసిన వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి .




దివ్యాంగుల సంయుక్త ప్రాంతీయ కేంద్రం 6వ వార్షికోత్సవం సందర్భంగా యాజమాన్యానికి సిబ్బందికి నా హృదయపూర్వక అభినందనలు.


 దివ్యాంగులకు జాబ్ మేళా నిర్వహిస్తున్న సందర్భంగా భగవంతుడు వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించి, మంచి జీవితాన్ని అందించాలని ప్రార్థిస్తున్నా.


 దివ్యాంగుల కోసం జాబ్ మేళా నిర్వహించి, ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ముందుకు వచ్చిన సంస్థల యాజమాన్యాలకు ధన్యవాదాలు.


 దివ్యాంగుల పట్ల సానుభూతి చూపించడం కాదు, సహకారం అందించడం అవసరం.


 దివ్యాంగులు ఆత్మవిశ్వాసంతో ముందుకు కదిలేందుకు, తల్లిదండ్రులు అవసరమైన ఆత్మస్థైర్యాన్ని అందించాలి.


 దివ్యాంగుల పట్ల ప్రేమ ఆదరణ కనపరచడం తప్ప, చిన్నచూపు తగదు.


 సర్వేపల్లి నియోజకవర్గంలో దివ్యాంగుల సంయుక్త ప్రాంతీయ కేంద్రం ఏర్పాటు చేయడం ద్వారా జిల్లావ్యాప్తంగా దివ్యాంగులకు సేవలందిస్తున్నాం.


 సర్వేపల్లి నియోజకవర్గంలో దివ్యాంగుల సంయుక్త ప్రాంతీయ కేంద్రాన్ని మంజూరు చేయించి, నిర్మించిన భారత ఉపరాష్ట్రపతి గౌ౹౹ శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు గారికి ధన్యవాదాలు.


 దివ్యాంగుల సంయుక్త ప్రాంతీయ కేంద్రం అభివృద్ధికి, దివ్యాంగుల సంక్షేమానికి సంపూర్ణ, సహాయ సహకారాలు అందిస్తా.

Comments