మిరమిట్లు గొలిపిన బాణాసంచా ప్రదర్శన

 *మిరమిట్లు గొలిపిన బాణాసంచా  ప్రదర్శన*


*బాణాసంచా వెలుగులతో మెరిసిన తిరుపతి*


*తరలివచ్చిన ప్రముఖులు, పురప్రజలు*


*జాతీయ మహిళ, పురుషుల ఆహ్వాన కబడ్డి పోటీలకు శ్రీకారం...*


*దీపకాంతులతో జాతీయ కబడ్డీ పోటీల బ్యానర్ ప్రదర్శన*


తిరుపతి, జనవరి 04 (ప్రజా అమరావతి);


 తిరుపతి ఇందిరా మైదానం లో  ప్రతిష్టాత్మకంగా జనవరి 05 నుండి 09 వరకు జరగనున్న జాతీయ మహిళ, పురుషుల ఆహ్వాన కబడ్డి పోటీలకు  బాణాసంచా దీపకాంతుల నడుమ  శ్రీకారం జరిగింది  మంగళవారం సాయంత్రం..



తిరుపతి  నగరపాలక సంస్థ ఆద్వర్యములో ఇందిరా మైదానము వేదికగా ఈ పోటీలను 


తిరుపతి శాసనసభ్యులు శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి, నగరపాలక సంస్థ మేయర్ శ్రీమతి ఆర్. శిరీషా, ఎం.ఎల్.సి. యండవల్లి  శ్రీనివాసుల రెడ్డి,  డిప్యూటీ మేయర్లు శ్రీ భూమన అభినయ్ రెడ్డి , శ్రీ ముద్ర నారాయణ, తి.తి.దే. అదనపు కార్యనిర్వహణాధికారి  శ్రీ  ఎ.వి. ధర్మా రెడ్డి, తిరుపతి అర్బన్ ఎస్పీ  వెంకట అప్పల నాయుడు, నగరపాలక సంస్థ కమీషనర్ శ్రీ పి.యస్. గిరిషా, ఎస్వీయు వి.సి. రాజారెడ్డి, మహిళా వర్శిటీ వి.సి. జమున, వెటర్నరీ యూనివర్సిటీ వి.సి. పద్మనాభ రెడ్డి, అడిషినల్ ఎస్పీ సుప్రజ లు ఆకాశ దీపాలను వెలిగించి గాలిలోనికి ఎగురవేసినారు.  బాణాసంచా  కార్యక్రమము దీపావళి పండుగ వాతావరణాన్ని తలపించింది. దీపకాంతులతో జాతీయ కబడ్డీ పోటీల బ్యానర్ ప్రదర్శన జరిగింది. 


*పండుగ వాతావరణం*


తిరుపతి ఇందిరా మైదానం మంగళవారము సాయంత్రం  జాతీయ క్రీడా కబడ్డీ పండుగ వాతావరణం సంతరించుకుంది. మైదానానికి విచ్చేసిన  ప్రముఖులతో పాటు  పురప్రజలు పెద్ద ఎత్తున హాజరై బాణాసంచా కార్యక్రమాన్ని ఆహ్లాదవాతావరణంలో తిలకించి ఉల్లాసంగా కార్యక్రమాన్ని ఆస్వాదించారు.  మంగళవారము సాయంత్రము నిర్వహించిన బాణాసంచా  ప్రదర్శన మిరమిట్లు గొలిపేలా సాగింది. ఈ ప్రదర్శన నగర ప్రజలకు నూతన ఉత్తేజాన్ని ఇచ్చింది.   ప్రదర్శన లో ప్రధానముగా ఈత చెట్టు, నాగుపాము, సూర్య చక్రం, రన్నింగ్ వీల్ ప్రదర్శన ఆకట్టుకున్నాయి.  వీటితో పాటు తారాజువ్వలు ఆకాశం లో నాట్య ప్రదర్శనతో  కనిపించాయి.  వివిధ రంగుల తో కూడిన షాట్స్ నగర ప్రజల ను వీనుల విందు చేసాయి. సాయంత్రం గం. 6.40 నిమిషాలకు తార జువ్వలు ఆకాశము వైపు దూసుకెళ్ళడంతో ప్రదర్శన ప్రారంభమైనది.  ఆకాశములో నక్షత్రాలే స్వయముగా వచ్చి తిరుపతిలో జాతీయ కబడ్డీ పోటీలకు  స్వాగతము పలికినట్లుగా కనిపించింది.   

ఆకట్టుకొన్న  సాంస్కృతిక కార్యక్రమములు 


తిరుపతి లో సాంస్కృతిక కళాకారులు ప్రదర్శించిన నృత్య ప్రదర్శనలు సందర్శకులను ఆకట్టుకున్నాయి.  మైదానములో వివిధ రంగుల డిస్కో లైట్ల మధ్యలో నిర్వహించిన ప్రదర్శనలు వీక్షకులను మైమరపింప చేశాయి.