యువతి యువకులు అంతా తమ తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలి



ఏలూరు (ప్రజా అమరావతి); 


యువత వారికి ఆసక్తి వున్న రంగాల్లో నైపుణ్యాలను అభివృద్ధి చేసుకునే దిశగా ప్రభుత్వం అందించే నైపుణ్యాభివృద్ది శిక్షణా తరగతులను సద్వినియోగం చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్  సీడాప్ ( సొసైటీ ఫర్ ఎంప్లాయ్‌మెంట్ జనరేషన్ అండ్ ఎంటర్‌ప్రైజ్ డెవలప్‌మెంట్) ఛైర్మన్ సాది శ్యామ్ ప్రసాద్ రెడ్డి తెలియ చేశారు.


 పశ్చిమ గోదావరి జిల్లా నందు జిల్లా గ్రామిణాభివృద్ధి సంస్థ మరియు డి.డి.యు.జి.కె.వై అర్ద్వర్యంలో జరుగుతున్న నిరుపేద యువతి యువకుల శిక్షణా కేంద్రాలను ఆయన సందర్శించటం జరిగినది. 


ఈ సందర్భంగా ఛైర్మన్ సాది శ్యామ్ ప్రసాద్ రెడ్డి  మాట్లాడుతూ,  యువతి యువకులు అంతా తమ తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాల


న్నారు.  శిక్షణా కాలంలో  అందించే శిక్షణ ను ఎంతో శ్రద్ధతో ఆకళింపు చేసుకుంటూ  తదుపరి కార్పోరేట్ కంపెనీల నందు ఉద్యోగములు సంపాదించుకోవాలన్నారు. తద్వారా తమ తమ కుటుంబాలకు చేదోడుగా వుండాలని. యువతీ యువకులకు తప్పక కంప్యుటర్ విజ్ఞానం మరియు ఇంగ్లీష్ సాఫ్ట్ స్కిల్స్ ఉండాలన్నారు. నిరంతరం నైపుణ్యాలను పెంచు కోవాలని, అలా వున్న రోజున మార్కెట్ నందు సువర్ణ అవకాశాలు వస్తాయని తెల్పినారు.


ఈ సందర్భంగా జేడీఎం .కె,పార్ధసారధి  మాట్లాడుతూ  పశ్చిమ గోదావరి జిల్లా పరిధి లో సీడప్ ఆధ్వర్యంలో   5 శిక్షణా కేంద్రాలు నిర్వహిస్తున్నామన్నారు. అందులో  ప్రస్తుతానికి 190 మంది నిరుద్యోగ యువతి యువకులు శిక్షణలు పూర్తి చేసుకొవటం జరిగినదన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న  వారిలో 109 మంది వివిధ ప్రయివేటు కంపెనీలనందు ఉద్యోగములు చేస్తునారన్నారు. ప్రస్తుతం మరో 352 మంది నిరుద్యోగ యువతీ యువకులు శిక్షణలో వున్నారని తెలియచేసినారు. 


ఈ పర్యటన నందు టి.టి. డి.సి. వట్లూరు నందు ఎస్.ఆర్.టి.పి.( రిటైల్ ) శిక్షణా కేంద్రము, సత్రంపాడు నందు వున్న డాటా-ప్రొ ద్వారా నిర్వహించుచున్న కంప్యూటర్ హార్డ్వేర్ మరియు కస్టమర్ రిలేషన్ మేనేజ్మెంట్ శిక్షణ తరగతులను,  రామచంద్రరావు పేట నందు వున్న ఆరా ఎడ్యుకేషనల్ సొసైటి ద్వారా జరుగుతున్న వెబ్-డెవలపర్స్ మరియు ఫుడ్ అండ్ బ్యావరేజేస్ శిక్షణను, పెద్ద రైల్వే స్టేషన్ నందు వున్న వై.టి.సీ. నందు ప్లో-స్కిల్ ద్వారా జరుగుతున్న ఎయిర్లైన్స్ ర్యాం ఎక్జిక్యూటివ్స్  శిక్షణ తరగతులను, అమ్మా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా జరుగుతున్న ఎలక్ట్రికల్ కోర్స్ లు శిక్షణలను పరిశిలించి అక్కడ శిక్షణ పొందుతున్న నిరుద్యోగ యువతి యువకులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. 


ఈ కార్యక్రములో  జేడీఎం కె.పార్థసారథి,  సీడాప్ చెందిన  వి.సురేష్, ఇంగ్లీష్ ట్రైనర్, శ్రీరాం, రిటైల్ ట్రైనర్, తదితరులు  పాల్గోన్నారు.



Comments