ఎన్టీఆర్ తోనే ఆ పార్టీకి అంతమయ్యే పరిస్థితి వచ్చింది- ఎన్టీఆర్ తోనే ఆ పార్టీకి అంతమయ్యే పరిస్థితి వచ్చింది


- తెలంగాణాలో రాజకీయ సమాధి చేసిన చంద్రబాబు

- ఆంధ్రప్రదేశ్లోనూ టీడీపీని అదే పరిస్థితికి తెచ్చారు

- 40 ఏళ్ళ అనుభవం ఉందంటూ సొల్లు కబుర్లు ఆపాలి

- రాష్ట్రంలో నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరించాలి

- రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నానిగుడివాడ, జనవరి 29 (ప్రజా అమరావతి): తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్ నే ఆ పార్టీకి అంతమయ్యే పరిస్థితి వచ్చిందని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) అన్నారు. శనివారం గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంలోని ఎన్టీఆర్ విగ్రహానికి క్షీరాభిషేకం చేసిన అనంతరం మంత్రి కొడాలి నాని మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో పాలనకు అనువుగా రెవెన్యూ డివిజన్లు, జిల్లాలను కూడా పెంచడం జరుగుతోందన్నారు. ప్రభుత్వ యంత్రాగాన్ని ప్రజల ముందుకు తీసుకురావాలన్న తపనతో సీఎం జగన్మోహనరెడ్డి పనిచేస్తున్నారని తెలిపారు. అయితే చంద్రబాబు మాత్రం పనికిమాలిన ఆరోపణలు చేయడానికి పరిమితమయ్యారన్నారు. తెలంగాణాలో చంద్రబాబు టీడీపీని రాజకీయ సమాధి చేశాడన్నారు. ఆంధ్రప్రదేశ్లో కూడా తెలుగుదేశం పార్టీని రాజకీయంగా సమాధి అయ్యే పరిస్థితిని చంద్రబాబు తీసుకువచ్చాడన్నారు. 40 ఏళ్ళ అనుభవం ఉందంటూ చంద్రబాబు చెప్పుకునే సొల్లు కబుర్లు ఆపాలన్నారు. ఇప్పటికైనా నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరించాలని సూచించారు. పేద, మధ్యతరగతి ప్రజల కోసం ఎన్టీఆర్ చేసిన పాలనను తలపించేలా సీఎం జగన్మోహనరెడ్డి పనిచేస్తారని తెలిపారు. అలాగే వైఎస్సార్ ఆశయాలను సాధిస్తూ తనదైన శైలిలో సీఎం జగన్ ముందుకు వెళ్తున్నారన్నారు. మహాత్మా గాంధీ, మహాత్మా పూలే, అంబేద్కర్, బాబూ జగజ్జీవన్ రాం, ఎన్టీఆర్, వైఎస్సార్, వంగవీటి మోహనరంగా వంటి మహనీయులను కూడా ఆదర్శంగా తీసుకోవడం జరుగుతుందన్నారు. పాలనను ప్రజల ముందుకు తీసుకువెళ్ళేందుకు రాష్ట్రంలోని 13 జిల్లాలను 26 జిల్లాలుగా మార్చుతూ నిర్ణయం తీసుకున్నారన్నారు. దీనివల్ల 15 రెవెన్యూ డివిజన్లు పెరిగాయన్నారు. జిల్లాల పునర్విభజనలో ఏవైనా మార్పులు, చేర్పులు ఉంటే సలహాలు ఇవ్వాలన్నారు. వాటిని కూడా తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. పనికిమాలిన ఆరోపణలు చేస్తూ పోతే రాష్ట్ర ప్రజల దృష్టిలో చంద్రబాబు మరింత దిగజారిపోతాడన్నారు. రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని, టీడీపీ, చంద్రబాబుకు ఎన్నికల్లో ఎన్నిసార్లు గడ్డి పెట్టినా తెలుసుకోవడం లేదన్నారు. డబ్బా మీడియాలో పదే పదే చెప్పే మాటలను ప్రజలు నమ్ముతారని అనుకుంటున్నారన్నారు. చంద్రబాబును ఇంద్రుడు, చంద్రుడిగా చూపించినా రాష్ట్ర ప్రజలు 23 సీట్లకు పరిమితం చేసి సీఎం జగన్ కు 151 సీట్లు కట్టబెట్టి ముఖ్యమంత్రిని చేశారన్నారు. రాష్ట్రంలో 10 వేలకు పైగా సచివాయాల నిర్మాణం ద్వారా పాలనను గ్రామస్థాయికి తీసుకువచ్చామన్నారు. 11 వేలకు పైగా రైతుభరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు అన్నిరకాల సేవలను అందిస్తున్నామన్నారు. గతంలో రైతులు విత్తనాల కోసం మండల, జిల్లా కేంద్రాల్లో పడిగాపులు కాయాల్సిన పరిస్థితులు ఉండేవన్నారు. గత రెండున్నరేళ్ళలో ఏ ఒక్క రైతూ విత్తనాలు దొరకక, నకిలీ విత్తనాల బారిన పడి పంట నష్టపోయిన దాఖలాలు లేవన్నారు. మద్దతు ధరను కూడా ప్రభుత్వం అందేలా చూస్తోందని తెలిపారు. ప్రభుత్వ సహాయం కోసం గ్రామ సచివాలయాల్లో దరఖాస్తు చేసుకున్న 72 గంటల్లో పరిష్కరించి ఇంటి దగ్గరకే అందించే పరిస్థితిని తీసుకువచ్చామని మంత్రి కొడాలి నాని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర దుక్కిపాటి శశిభూషణ్, జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఉప్పాల హారిక, ఉప్పాల రాము, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ అడపా బాబ్జి, వైసీపీ పట్టణ అధ్యక్షుడు గొర్ల శ్రీను, ఎన్టీఆర్ స్టేడియం కమిటీ ఉపాధ్యక్షుడు పాలేటి చంటి, సంయుక్త కార్యదర్శి పర్వతనేని ఆనంద్, సభ్యులు బొగ్గరపు తిరుపతయ్య, దొప్పలపూడి రవి, పెద్ద ప్రసాద్, ఎంపీపీలు పెయ్యల ఆదాం, దాసరి అశోక్ కుమార్, జడ్పీటీసీ సభ్యుడు గోళ్ళ రామకృష్ణ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రూరల్ మండల అధ్యక్షుడు మట్టా జాన్విక్టర్, పార్టీ నాయకులు పొట్లూరి వెంకట కృష్ణారావు, వల్లూరుపల్లి సుధాకర్, కసుకుర్తి బాబ్జి, కొల్లి విజయ్, పాలడుగు రాంప్రసాద్, గాదిరెడ్డి రామలింగారెడ్డి, మేకల సత్యనారాయణ, కొంకితల ఆంజనేయప్రసాద్, గిరిబాబాయ్, మూడెడ్ల ఉమా, చింతల భాస్కరరావు, వెంపటి సైమన్, కొలుసు నరేంద్ర, రేమల్లి పసి, సయ్యద్ గఫార్, ఆర్వీఎల్ నరసింహారావు, సర్దార్ బేగ్, యార్లగడ్డ సత్యభూషణ్, చుండి బాబి, పెద్ది కిషోర్, పొట్లూరి మురళీధర్, తోట రాజేష్, లోయ రాజేష్, గుత్తా నాని, పుల్లేటికుర్తి వినయ్, ఎస్కే బాజీ, అలీబేగ్, చింతాడ నాగూర్, మాదాసు వెంకటలక్ష్మి, మెండా చంద్రపాల్, జ్యోతుల సత్యవేణి తదితరులు పాల్గొన్నారు.

Comments