వ్యాసరచన, వకృత్వ పోటీల్లో విజేతలకు జాయింట్ కలెక్టర్ లు హిమాన్షు శుక్లా, డా. బి ఆర్ అంబేద్కర్ లు బహుమతి ప్రధానం చేశారు.

 


ఏలూరు (ప్రజా అమరావతి);


దృఢమైన ప్రజాస్వామ్య నిర్మాణం లో ఓటర్ల పాత్ర అనే అంశంపై  డిగ్రీ, ఇంటర్, పాఠశాల విద్యార్థిని, విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన, వకృత్వ పోటీల్లో విజేతలకు జాయింట్ కలెక్టర్ లు హిమాన్షు శుక్లా, డా. బి ఆర్ అంబేద్కర్ లు బహుమతి ప్రధానం చేశారు.


మంగళవారం స్థానిక కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో విజేత లకు బహుమతి ప్రధానోత్సవం కార్యక్రమం నిర్వహించారు.



డిగ్రీ విభాగం లో వ్యాసరచన లో  ఆర్. అజయ్ కుమార్ (ఇంగ్లీషు), విఎస్. ఎస్.కె.ఎన్. మల్లయ్య (తెలుగు) ;

వకృత్వవిభాగంలో కె అర్జున్ అభిషేక్ (ఇంగ్లీష్) , ఎన్.రేణుక (తెలుగు) 


ఇంటర్ విభాగం..  వ్యాసరచన లో  వై.దేవి (మొదటి స్థానం) ఎన్. మహాలక్ష్మి (రెండవ స్థానం) ;  వకృత్వం  లో జి. సమాంజలి ( మొదటి స్థానం) సీహెచ్. రాధమణి  (రెండవ స్థానం) సాధించారు. 

పాఠశాల విభాగంలో  వ్యాసరచన  (మొదటి , రెండు మూడో  స్థానాల్లో )  కె.భాగ్యలక్ష్మి ,  పి. వెన్నెల ; కె. ఎమ్. ప్రియదర్శిని  ; వకృత్వ విభాగంలో 

( మొదటి, రెండవ, మూడో స్థానం) వి.గీతిక, ఆర్. నాగమాణిక్యం , టి.లిఖిత గౌడ్ లు సాధించారు.



Comments