విద్యార్థులకు కాకాణి దిశానిర్దేశం"

 *" విద్యార్థులకు కాకాణి దిశానిర్దేశం"*




శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా (ప్రజా అమరావతి), సర్వేపల్లి నియోజకవర్గంలో పొదలకూరు, వెంకటాచలం మండలాల్లో పర్యటించి, పదవ తరగతి విద్యార్థులకు విద్యా సామగ్రి అందించిన వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి .


*విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలతో కోలాహలంగా జరిగిన కార్యక్రమం*


*సాంప్రదాయ పద్ధతిలో కాకాణికి ఘన స్వాగతం పలికిన విద్యార్థులు.*


*స్కూళ్లలో నాడు-నేడు పధకం కింద జరిగిన అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే కాకాణి.*


*తనకు చదువు చెప్పిన సిద్ధయ్య మాష్టారును ఘనంగా సన్మానించిన ఎమ్మెల్యే కాకాణి.*




 ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యతలు స్వీకరించిన తర్వాత, ఆంధ్ర రాష్ట్ర విద్యా రంగంలో అనేక గొప్ప సంస్కరణలు తీసుకొనిరావడం జరిగింది.


 విద్యను అభ్యసించే పిల్లలకు *"నాడు - నేడు" "జగనన్న విద్యా కానుక" "జగనన్న గోరుముద్ద" "జగనన్న అమ్మ ఒడి"* లాంటి అనేక కార్యక్రమాలు ప్రారంభించిన ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది.


 విద్యార్థులు చదువుల విషయంలో మొక్కుబడిగా కాకుండా ఇష్టంగా మార్చుకొని, చదవడం అలవర్చుకోవాలి.


 కరోనా నేపథ్యంలో, కరోనా వ్యాప్తి చెందుతున్నందున ఆలోచనతో, పరీక్షలు నిర్వహించకుండానే ఉత్తీర్ణులుగా ప్రకటించవలసి వచ్చింది.


 విద్యార్థులు పరీక్షల గురించి ఆలోచించకుండా, పరీక్షలు నిర్వహించినా, లేకపోయినా పరీక్షలకు హాజరయ్యే విధంగానే సంసిద్ధం కావాలి.


 డిగ్రీలు పూర్తి చేసి, ఉద్యోగాల కోసం వెంపర్లాడకుండా పట్టుదలతో చదివి, ప్రతిభతో ఉద్యోగావకాశాలు పొందాలి.


 సర్వేపల్లి నియోజకవర్గం అంగన్వాడి స్కూళ్ల నుండి విక్రమ సింహపురి యూనివర్సిటీ దాకా అనేక రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి విద్యాలయాలకు వేదికగా మారింది.


 సర్వేపల్లి నియోజకవర్గాన్ని విద్యారంగంలో రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తీసుకొని వచ్చే విధంగా, పిల్లలు తమ ప్రతిభను చాటి చెప్పాలి.


 సర్వేపల్లి నియోజకవర్గ అతిపెద్ద సేవకుడిగా సేవలందిస్తున్న మీ శాసన సభ్యుడినైన నేను, విద్యా రంగంలో కూడా పిల్లలు ప్రగతి సాధించడానికి సంపూర్ణ సహకారాలు అందిస్తా.

Comments