తాడేపల్లి (ప్రజా అమరావతి); ఐఐటీ-కాన్పూర్ లో డిసెంబర్ 30వ నిర్వహించిన 6వ అంతర్జాతీయ సుస్థిర శక్తి వనరులు- పర్యావరణ మార్పులు అనే సదస్సులో కెఎల్ విశ్వవిద్యాలయం బయోటెక్నాలజీ విభాగానికి చెందిన అధ్యాపకులు డాక్టర్ ప్రీతమ్ కుమార్ దీక్షిత్ కు యంగ్ సైంటిస్ట్ అవార్డ్స్ 2021 లభించిందని విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డాక్టర్ వైవిఎస్ఎస్ఎస్వీ.ప్రసాద్ రావు ఒక ప్రకటనలో తెలిపారు. సాంప్రదాయేతర ఇంధనవనరులైన ఉదజన తయారీ, బయోపాలిమర్స్,బయో ప్లాస్టిక్ తయారీ, వ్యర్ధ జలాల శుద్ధి పర్యావరణహిత సాంకేతిక అంశాల పైన పరిశోధనలకు గాను ఈ అవార్డు లభించింద
ని తెలిపారు. ఈ అవార్డు తో పాటు 25000 నగదు బహుమతి, ప్రశంసా పత్రం ను ఐ.ఎస్.ఈ.ఈ.ఎస్ సంస్థ అధ్యక్షులు అవినాష్ అగర్వాల్ అందజేశారు. ఈ అవార్డు గెలుపొందిన డాక్టర్ ప్రీతమ్ కుమార్ దీక్షిత్ ను విశ్వవిద్యాలయ యాజమాన్యం, ప్రో ఛాన్సలర్ డాక్టర్ జగన్నాథరావు, ఉపకులపతి డాక్టర్ సారధి వర్మ, ప్రో వైస్ ఛాన్సలర్ డాక్టర్ ఎన్.వెంకట్రామ్, బయో టెక్నాలజీ విభాగాధిపతి డాక్టర్ గిరిధర్, అధ్యాపకులు అభినందించారు
addComments
Post a Comment