కొవ్వూరు (ప్రజా అమరావతి);
గర్భిణీ స్త్రీ లకు గర్భస్థ లింగ నిర్దారణ పరీక్షలు చేయ్యడం, చేయించుకోవడం చట్టరీత్యా నేరం ...
.
డిప్యూటి డి.యం.హెచ్.ఓ. డా.ఎస్. ధర్మరాజు.
లింగ వివక్షకు దారితీసే ప్రతి చర్య చట్ట వ్యతిరేక చర్యగా పరిగణించవచ్చునని, గర్భిణీ స్త్రీలకు గర్భస్థ లింగ నిర్దారణ పరీక్షలు చేసినా , చేయుంచుకున్నా, సమాచారం ఇచ్చినా చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని డిప్యూటి డియంహెచ్ఓ డా.ఎస్. ధర్మ రాజు హెచ్చరించారు
శుక్రవారం ఉదయం కొవ్వూరు డిప్యూటి డి. యం. హెచ్ ఓ. వారి కార్యా లయంలో కమిటీ ఛైర్మన్ ఆధ్వర్యంలో "సేవ్ గర్ల్ చైల్డ్ యాక్ట్" పై డివిజన్ స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ధర్మరాజు మాట్లాడుతూ ప్రతీ స్కెనింగ్ కేంద్రాల్లో గర్భిణీ స్త్రీలు ఆడా పిల్లా, మగా పిల్లలా అని నిర్దారణ చేసినా, చేయించుకున్నా గర్భస్థ పిండ నిర్ధారణ పరీక్ష నిషేధ చట్టం క్రింద అటువంటి వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ప్రతినెలా మొదటి శుక్రవారం డివిజన్ స్థాయి లో, మూడవ శుక్రవారం జిల్లా స్థాయిలో సమావేశం నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రతి మూడు నెలల ఒకసారి స్కెనింగ్ సెంటర్లు, ల్యాబ్ లు, ప్రైవేట్ ప్రసూతి హాస్పిటల్స్ లో రికార్డులు తనిఖీ నిర్వహిస్తామన్నారు.. ఆడ, మగ పిల్ల లా అని తెలుసు కునేందుకు స్కెనింగ్ కేంద్రాల్లో పని చేసే టెక్నీషియాన్ లు సమాచారం విడుదల చేసినా,ఎవరినైనా తెలియని వారిని పంపించి సమాచారన్ని తెలుసుకొని చేరవేసినా వారిపై కూడా చర్యలు తీసుకుంటామన్నారు. లింగ నిర్ధారణ వివరాలు తెలుసుకుని ఎవరైనా సమాచారం సేకరిస్తే ప్రజలు మా దృష్టికి తీసుకురావాలని కోరారు.
ఈ సమావేశంలో కమిటీ సభ్యులు, డిఎల్. పిఆర్ఓ, యం. లక్ష్మణాచార్యులు, డా. కె. ఆశీర్వాదం, డా. వసుంధర, లాయర్ పి. శర్మ, ఎస్. సూర్య కుమారి తదితరులు పాల్గొన్నా రు.
addComments
Post a Comment