అట్టహాసంగా జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నిక మరియు ప్రమాణ స్వీకారం :-
*అట్టహాసంగా జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నిక మరియు ప్రమాణ స్వీకారం :-*


*జిల్లా పరిషత్ చైర్మన్ గా ఎర్రబోతుల పాపిరెడ్డి :-*


*ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరైన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు :-*


కర్నూలు, జనవరి 04 (ప్రజా అమరావతి);


*కొలిమిగుండ్ల నుంచి జెడ్పిటిసిగా ఏకగ్రీవమైన ఎర్రబోతుల పాపిరెడ్డి ఒక్కరే జెడ్పీ చైర్మన్ గా పోటీకి దిగడంతో ఏకగ్రీవం అయినట్లు ప్రిసైడింగ్ అధికారి జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వర రావు ప్రకటించారు.*


*రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు మంగళవారం ఉదయం కర్నూలు జిల్లా ప్రజా పరిషత్ సభా భవనంలో జిల్లా పరిషత్ చైర్మన్ పదవికి అధికారులు ఎన్నికలు నిర్వహించారు.*


*జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నికకు ప్రత్యేక ఆహ్వానితులుగా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ చల్లా భగీరథ రెడ్డి, ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి, బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే బ్రిజేంద్ర నాథ్ రెడ్డి, పత్తికొండ ఎమ్మెల్యే కె శ్రీదేవి, నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, జడ్పీటీసీలు, కో ఆప్టెడ్ సభ్యులు హాజరయ్యారు. జడ్పీ చైర్మన్ గా ఎర్రబోతుల పాపిరెడ్డి పేరును మహానంది జడ్పిటిసి సభ్యుడు కె ఆర్ మహేశ్వర్ రెడ్డి ప్రతిపాదించగా, మిడ్తూరు జడ్పీటీసీ సభ్యుడు పి.యుగంధర్ రెడ్డి, వెల్దుర్తి జడ్పిటిసి సుంకన్న లు బలపరచడంతో జడ్పీ చైర్మన్ పదవికి ఎర్రబోతుల పాపిరెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు జిల్లా కలెక్టర్ ప్రకటించారు. ఎన్నికైన జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డిచే ప్రిసైడింగ్ అధికారి జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వర రావు ప్రమాణ స్వీకారం చేయించి ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు. జడ్పీ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన ఎర్రబోతుల పాపిరెడ్డిని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీలు, కో ఆప్టెడ్ సభ్యులు, తదితరులు అభినందనలు తెలిపారు.*


*ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ లు దిల్షాద్ నాయక్, కే బుజ్జమ్మ, కో ఆప్టెడ్ సభ్యులు సయ్యద్ అస్లాం, ఖాద్రీ, సయ్యద్ సులేమాన్, జెడ్పీ సీఈఓ వెంకటసుబ్బయ్య, డిప్యూటీ సీఈఓ భాస్కర్ నాయుడు, జెడ్పిటిసి సభ్యులు పాల్గొన్నారు.*


*జిల్లా అభివృద్ధికి కృషి - అందరి సమన్వయంతో ముందుకెళ్తాం : ఎర్రబోతుల పాపిరెడ్డి :-*


*జెడ్పి తొలి సమావేశంలో జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి మాట్లాడుతూ...నా మీద నమ్మకంతో ఈ పదవి కట్టబెట్టిన రాష్ట్ర ముఖ్యమంత్రి  వైయస్ జగన్ మోహన్ రెడ్డి, జిల్లా ఇన్చార్జి మంత్రి, జిల్లా మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా నా పేరు ప్రతిపాదించిన, బలపరిచిన జడ్పిటిసి సభ్యులకు ధన్యవాదాలు. జిల్లాను అన్ని రంగాలలో ముందుకు తీసుకెళ్లేందుకు, అందరి సహకారంతో ముందుకు వెళతామన్నారు. సభ్యులందరి సహకారంతో సభలు, సమావేశాలు విజయవంతంగా నడిపిస్తానని జడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి అన్నారు.*