జగన్ అంటే నమ్మకం విశ్వసనీయత.
సామాజిక న్యాయం వైపు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు.
రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్.
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అంటే నమ్మకం విశ్వసనీయత అని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. తమిళనాడులో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన స్టాలిన్ కూడా అతి తక్కువ కాలంలోనే ప్రజల్లో విశ్వసనీయతను నమ్మకాన్ని పొందారని ఆయన అన్నారు. ఆలిండియా బ్యాక్వర్డ్ క్లాసెస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సామాజిక న్యాయం అంశంపై వ్యవస్థాపకులు జస్టిస్ వి. ఈశ్వరయ్య అధ్యక్షతన జాతీయ స్థాయి వెబినార్ జరిగింది. ఈ వెబినార్ లో ముఖ్యఅతిథిగా తమిళనాడు ముఖ్యమంత్రి MK స్టాలిన్, ఆర్ జె డీ నాయకులు తేజస్వి యాదవ్, భుజబల్, పలువురు ఎంపీ లు, ఎన్ జి ఓ సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ వెబినార్ లో ఏపీ విద్యాశాఖ మంత్రి సురేష్ పాల్గొని ప్రసంగించారు.
విశ్వసనీయత నమ్మకానికి మారుపేరుగా ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిలిచారని అదే కోవలో తమిళనాడు సీఎం స్టాలిన్ కూడా కొద్దికాలంలోనే ప్రజల అభిమానాన్ని కూడగట్టారన్నారు. రెండు రాష్ట్రాలు కూడా విద్యకు పెద్దపీట వేస్తున్నాయని విద్యకోసం చేసే ఖర్చు రాబోయే తరాల భవిష్యత్ కు పెట్టే పెట్టుబడి అనేది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భావజాలం అని మంత్రి వివరించారు. మధ్యాహ్న భోజన పధకాన్ని విద్యార్థులకు రుచికరమైన పౌష్టికహారం అందించే లక్ష్యం తో ప్రత్యేక మెనూతో అమలు చేస్తున్నామని చెప్పారు. ఏపీ లో రాజకీయ పదవుల్లోను సామాజిక న్యాయం పాటిస్తూ 50 శాతం మహిళలకు కేటాయించటమే కాక ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ప్రాధాన్యత ఇవ్వటం జరిగిందని, మంత్రివర్గం లో కూడా వెనుకబడిన సామాజిక వర్గాలకు ముఖ్యమంత్రి ప్రాధాన్యత ఇవ్వటం జరిగిందని వివరించారు. ఏపీ లో వెనుక బడిన వర్గాలకు రాజకీయ సాధికారత, మహిళా సాధికారత కలిగించటం జరిగిందన్నారు. బలహీన వర్గాలను వెనుకబడిన వర్గాలుగా కాకుండా వారే వెన్నెముకగా తయారు చేశామన్నారు. మెడికల్, డెంటల్ యు జి, పి జి ప్రవేశాల్లో ఓబీసీ లకు 27 శాతం రిజర్వేషన్ అమలుకు సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును సామజిక న్యాయం దిశగా వేసే అడుగులో తొలి విజయం అన్నారు. ఇందుకోసం పోరాడిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు. సామాజిక న్యాయం ఒక సుధీర్ఘ ప్రయాణమని ఇంకా చాలా సాధించాల్సి ఉందని ఈ సాధనలో భాగంగా బీసీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో చేపట్టే కార్యక్రమాల్లో ఏపీ నుంచి అవసరమైన సహకారం తప్పక ఉంటుందని మంత్రి సురేష్ తెలిపారు.
addComments
Post a Comment