పోడూరు ( కవిటం) (ప్రజా అమరావతి) ;
క్రికెట్ బ్యాట్ చేతపట్టిన మంత్రి శ్రీరంగనాధ్ రాజు
సంక్రాంతి వేళ కవిటంలో క్రికెట్ పోటీలు...
సంక్రాంతి పండుగ వేళ యువత చెడు వ్యసనాలపై దృష్టి మారల్చకుండా గ్రామీణ క్రీడలను నిర్వహించడం అభినంద నీయమని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీ రంగనాథరాజు పేర్కొన్నారు.
ఆదివారం సంక్రాంతి సందర్భంగా పోడూరు మండలం కవిటం గ్రామంలో నిర్వహిస్తున్న కె.వి రెడ్డి మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ కి ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీరంగనాధరాజు మాట్లాడుతూ, యువత లో క్రీడా స్ఫూర్తిని నింపి, సన్మార్గంలో నడిచేందుకు గ్రామీణ క్రీడలు ఎంతో దోహదం చేస్తాయన్నారు. గత కొన్ని సంవత్సరాలు గా ఇటువంటి క్రీడలను నిర్వహించేందుకు ముందుకు వచ్చిన మణికంఠ రెడ్డిని అభినందిస్తున్నామన్నారు. క్రీడల్లో గెలుపు ఓటములు సహజం, వారిలో మనోధైర్యాన్ని, పోటీతత్వం పెంచేవే క్రీడలన్నారు. గతంలో గ్రామీణ క్రీడాలంటే గూటిబిళ్ళ, పెంకులు, తదితర ఆటలు ఆడేవరామని, ప్రస్తుతం క్రికెట్ ఆట ను ఎక్కువ మంది ఆడుతున్నారని శ్రీరంగనాధ్ రాజు తెలిపారు. యువత ఆసక్తిని గమనించి, క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నట్లు, తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల నుంచి 43 బృందాలు 02-01-2022 ఆదివారం నుండి 11-01-2022 మంగళవారం వరకు 10 రోజులు పాటు జరిగే పోటీల్లో పాల్గొంటున్నట్లు తెలిపారు. సంక్రాంతి పండుగ సందర్భంగా యువత చెడు వ్యసనాలు, జూదాలు, పందేల జోలికి వెళ్లకుండా క్రీడా పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. క్రీడా పోటీల్లో పాల్గొన్న యువత సన్మార్గంలో నడిచి, దేనినైనా మనోధైర్యం తో ఎదుర్కొనే అవకాశం ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి గుంటూరి పెద్దిరాజు, ఎంపిపి సుబ్బిత సుమంగళి, డీఎస్పీ డి.వీరంజనేయులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు, యువత, క్రికెట్ టీమ్స్ పాల్గొన్నారు.
addComments
Post a Comment