కులమతాలకు అతీతంగా మనుషులంతా కలిసి ప్రకృతితో మమేకమై జీవించడమే మకర సంక్రాంతి చాటి చెప్పే మంగళా శాసనము.

 గుంటూరు (ప్రజా అమరావతి);      కులమతాలకు అతీతంగా మనుషులంతా కలిసి ప్రకృతితో మమేకమై జీవించడమే మకర సంక్రాంతి చాటి చెప్పే మంగళా శాసనమ

ని శాసనమండలి సభ్యులు, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేతృత్వంలో రాష్ట్ర ప్రజలంతా నిత్య  సంక్రాంతి కాంతులతో, సుఖ సంతోషాలతో జీవిస్తున్నారనీ... అందుకు నిదర్శనంగానే అంగరంగ వైభవంగా సంక్రాంతి వేడుకలు జరుపుకుంటున్నామనీ... అప్పిరెడ్డి వెల్లడించారు.


గుంటూరు బృందావన్ గార్డెన్స్ సమీపంలోని ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి క్యాంప్ కార్యాలయంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. గురువారం జరిగిన ఈ వేడుకల్లో భాగంగా వేసిన భోగి మంటలు, మన సంస్కృతి, సాంప్రదాయాలకు అద్దం పట్టే రీతిలో వేసిన రంగవల్లుల మధ్య పందెం కోళ్లు, పోట్ల గిత్తలు, డూడూ బసవన్నల గంగిరెద్దుల ఆటలు, మహిళల కోలాటం తదితర కోలాహలం నడుమ కొనసాగిన సంక్రాంతి సంబరాలు ప్రజలను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ వేడుకల్లో జీడీసీసీ బ్యాంకు ఛైర్మన్ శ్రీ లాలుపురం రాము గారు, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ బత్తుల దేవానంద్, డిప్యూటీ మేయర్ షేక్ సజీల, పలు కార్పొరేషన్ల డైరెక్టర్లు, కార్పొరేటర్లు, డివిజన్ పార్టీ అధ్యక్షులు పాల్గొన్నారు.