నాలుగు వళ్ళ విభాగంలో గుంటూరు, ప్రకాశం జిల్లాల ఎడ్ల జతకు ప్రథమ స్థానం- నాలుగు వళ్ళ విభాగంలో గుంటూరు, ప్రకాశం జిల్లాల ఎడ్ల జతకు ప్రథమ స్థానం 


- తొమ్మిది మంది విజేతలకు రూ.1.71 లక్షల నగదు బహుమతులు 

- బహుకరించిన కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ తన్నీరు నాగేశ్వరరావు 
గుడివాడ, జనవరి 13 (ప్రజా అమరావతి): గుడివాడ పట్టణం లింగవరం రోడ్డులోని కే. కన్వెన్షన్ లో ఎన్టీఆర్ టూ వైఎస్సార్ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతున్న జాతీయస్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బండలాగుడు ప్రదర్శన పోటీల్లో భాగంగా నిర్వహించిన నాలుగు పళ్ళ విభాగంలో గుంటూరు, ప్రకాశం జిల్లా ఎడ్ల జత ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకున్నాయి. గుంటూరు జిల్లా పత్తిపాడు మండలం పాత మల్లాయిపాలెంపాలేనికి చెందిన సిద్ధంశెట్టి సామ్రాజ్యం, ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలం ఖాజీపురానికి చెందిన వేగినాటి ఓసరారెడ్డి ఎడ్ల జత నిర్ణీత సమయంలో 4,738.5 అడుగుల మేర బండను లాగి ప్రథమస్థానంలో నిలిచిందని కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ తన్నీరు నాగేశ్వరరావు చెప్పారు. అలాగే గుంటూరు జిల్లా పొన్నూరు మండలం వల్లభరావుపాలేనికి చెందిన కొండబోలు చార్విక్ విహన్ చౌదరి ఎడ్ల జత 4,518.5 అడుగుల దూరం లాగి ద్వితీయ స్థానంలో, గుంటూరు జిల్లా మాచర్ల మండలం రాయవరానికి చెందిన ఐలిదిండి బాల శంకరరావు ఎడ్ల జత 4,022 అడుగుల దూరం లాగి తృతీయ స్థానాల్లో నిలిచాయి. గుంటూరు జిల్లా పత్తిపాడుకు చెందిన కాకాని సురేష్ బాబు, నాదెండ్లకు చెందిన చాగంటి చిన ఆదినారాయణ ఎడ్ల జత 3,900 అడుగుల దూరం లాగి నాల్గవ స్థానంలో, కృష్ణాజిల్లా విజయవాడకు చెందిన వల్లభనేని మోహనరావు ఎడ్ల జత 3,865.1 అడుగుల దూరం లాగి ఐదవ స్థానంలో, గుంటూరు జిల్లా శ్రీరుక్మిణీపురానికి చెందిన అన్నంగి వెంకటేశ్ యాదవ్, పత్తిపాడుకు చెందిన మల్లం అజయ్ కుమార్ ఎడ్ల జత 3,650.08 అడుగుల దూరం లాగి ఆరవ స్థానంలో, ప్రకాశం జిల్లా కురిచేడు మండలం పోట్లపాడుకు చెందిన బయ్యపురెడ్డి ఎడ్ల జత 3,905 . 5 అడుగుల దూరం లాగి ఏడవ స్థానంలో, గుంటూరు జిల్లా విజయనగర్ కు  చెందిన నూకవరపు శ్రీధర్ ఎడ్ల జత 3,384.4 అడుగుల దూరం లాగి ఎనిమిదవ స్థానంలో, గుంటూరు జిల్లా పత్తిపాడు మండలం కొత్త మల్లాయిపాలేనికి చెందిన కళ్ళం రాజశేఖరరెడ్డి ఎడ్ల జత 3,337.2 అడుగుల దూరం లాగి తొమ్మిదవ స్థానంలో నిలిచాయి. విజేతలకు వరుసగా రూ.35 వేలు, రూ.30 వేలు, రూ.25 వేలు, రూ.22 వేలు, రూ.18 వేలు, రూ.15 వేలు, రూ.13 వేలు, రూ.10 వేలు, రూ. 8 వేల నగదు బహుమతులను కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ తన్నీరు నాగేశ్వరరావు అందజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నేత దుక్కిపాటి శశిభూషణ్, మున్సిపల్ మాజీ వైస్  చైర్మన్ అడపా బాబ్జి, వైసీపీ పట్టణ అధ్యక్షుడు గొర్ల శ్రీను, ఎన్టీఆర్ స్టేడియం కమిటీ ఉ పాధ్యక్షుడు పాలేటి చంటి, గుడివాడ ప్రభుత్వాసుపత్రి అభివృద్ధి సంఘం చైర్మన్ ఎంవీ నారాయణరెడ్డి, ఎంపీపీలు పెయ్యల ఆదాం, గద్దె పుష్పరాణి, జడ్పీటీసీ సభ్యుడు గోళ్ళ రామకృష్ణ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రూరల్ మండల అధ్యక్షుడు మట్టా జాన్ విక్టర్, నాయకులు వల్లూరుపల్లి సుధాకర్, కసుకుర్తి బాబ్జి, పాలడుగు రాంప్రసాద్, గాదిరెడ్డి రామలింగారెడ్డి, మేకల సత్యనారాయణ, కొంకితల ఆంజనేయప్రసాద్, గిరిబాబాయ్, మూడెడ్ల ఉమా, దారం ఏడుకొండలు, చింతల భాస్కరరావు, వెంపటి సైమన్, దారం నరసింహా, కొలుసు నరేంద్ర, రేమల్లి పసి, ఆర్వీఎల్ నరసింహారావు, షేక్ సయ్యద్, యార్లగడ్డ సత్యభూషణ్, చుండి బాబి, పెద్ది కిషోర్, పొట్లూరి మురళీధర్, తోట రాజేష్, లోయ రాజేష్, ఎస్కే బాజీ, అలీబేగ్, చింతాడ నాగూర్, చిన్ని దుర్గాప్రసాద్, మాదాసు వెంకటలక్ష్మి, గంటా చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.