కాకాణి పూజిత విరాళం

 *"కాకాణి పూజిత విరాళం


"*శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా (ప్రజా అమరావతి), సర్వేపల్లి నియోజకవర్గం, పొదలకూరు మండలంలో తమ సొంత గ్రామమైన తోడేరులో తిరుమల తిరుపతి దేవస్థానం సహకారంతో 50 లక్షల రూపాయలతో చేపట్టనున్న రామాలయ పునర్నిర్మాణానికి, నాల్గవ వంతు 12 లక్షల 50 వేల రూపాయలు విరాళాన్ని సహాయక కమీషనర్ దేవాదాయ శాఖ వారికి అందజేసిన సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారి కుమార్తె శ్రీమతి పూజిత .
 మా స్వగ్రామమైన తోడేరులో మా తాతగారైన కీ౹౹శే౹౹ శ్రీ కాకాణి రమణారెడ్డి గారి జ్ఞాపకార్థం రామాలయాన్ని నేను, నా సోదరి సుచిత్ర పునర్నిర్మించాలని భావించాం.


సర్వేపల్లి శాసన సభ్యునిగా మా నాన్న కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు మా కోరికను మన్నించి, తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా నిధులు మంజూరు చేయించారు.


 రామాలయ పునర్నిర్మాణానికి అంచనా విలువ 50 లక్షల రూపాయలు అవసరం పడడంతో, తిరుమల తిరుపతి దేవస్థానం వారు 37 లక్షల 50 వేల రూపాయలు శ్రీవారి ట్రస్టు ద్వారా అందించడానికి సంసిద్ధత వ్యక్తం చేశారు.


 రామమందిరం నిర్మాణానికి 12లక్షల 50 వేల రూపాయలు గ్రామస్తుల భాగస్వామ్యానికి ముందుగానే జమ చేయవలసినదిగా ఉత్తర్వుల్లో పేర్కొనడం జరిగింది.


 తోడేరు గ్రామం, మా కుటుంబం గనుక, గ్రామస్తుల పక్షాన 12లక్షల 50 వేల రూపాయలు నేను, నా చెల్లెలు సుచిత్ర ఇద్దరం కలిసి భరించాలని నిర్ణయించాం.


 రామాలయ నిర్మాణానికి మా వంతు భాగస్వామ్యం12లక్షల 50 వేల రూపాయలు సహాయక కమీషనర్ దేవాదాయ శాఖ వారికి, పెద్దలు, గ్రామస్తుల సమక్షంలో అందజేశాం.


 తోడేరు గ్రామంలో మంచి రామమందిరం నిర్మించాలన్న మా తాతగారు కాకాణి రమణా రెడ్డి గారి కల నెరవేరబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది.


మా తోడేరు గ్రామంలో రామమందిరం నిర్మాణం కోసం నిధులు మంజూరు చేసిన పూజ్యులు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి గారికి, గౌరవ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జవహర్ రెడ్డి గారికి మా గ్రామస్తులందరీ తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా.


 రామమందిరం నిర్మాణానికి అంచనాలు తయారు చేయించి, సంపూర్ణ సహాయ సహకారాలు అందించిన దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ గారికి, వారి కార్యాలయ సిబ్బందికి మా ధన్యవాదాలు.