ఎండో స్కొపిక్ విధానంలో ఫారిన్ బాడీని రిమూవ్ చేసిన రమేష్ హాస్పిటల్ వైద్య నిపుణులు.

 ఎండో స్కొపిక్ విధానంలో ఫారిన్ బాడీని రిమూవ్ చేసిన రమేష్ హాస్పిటల్ వైద్య నిపుణులు.
గుంటూరు (ప్రజా అమరావతి);

10 సంవత్సరములు వయసు కలిగిన ఒక బాలుడు   ఆల్కలిన్ సెల్ బ్యాటరీలు నోట్లో పెట్టుకుని ఆడుకుంటూ పొరపాటున మింగి వేసాడు.

ఆ విషయం కుటుంబ సభ్యులకు తెలిసి రాత్రి సమయంలో రమేష్ హాస్పిటల్స్ కు తీసుకురావడం జరిగింది.


రమేష్ హాస్పిటల్స్ జీర్ణ కోశ వ్యాధి నిపుణులు డాక్టర్ లోకేష్ ఆ బాలుడిని పరిశీలించి,ఎక్స్ రే మరియు సి. టీ స్కాన్ పరీక్షలు నిర్వహించి ఆ రెండు బ్యాటరీ సెల్ కు ఒకటి పొట్టలోను,రెండవది చిన్న ప్రేవులలో రెండవ భాగానికి చేరుకున్నట్లుగా నిర్ధారించి గ్యాస్ట్రో స్కోపీ విధానం లో ఆ సెల్ బ్యాటరీలను విజయవంతంగా తీసివేయడం జరిగింది.


జింక్, పొటాషియం, గ్రాఫైట్,మాంగనీస్ డయాక్సైడ్ మిశ్రములతో తయారైన సెల్ బ్యాటరీలు ప్రమాదకరమైనవని వాటి వలన అల్సర్లు,రక్త స్రావం,ప్రేగులు చిట్లిపోవడం, కాస్టిక్ పరిణామాలు సంభవించవచ్చని జీర్ణ కోశ వ్యాధి నిపుణులు డాక్టర్ లోకేష్ తెలియ చేసారు.


రమేష్ హాస్పిటల్స్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్.రాయపాటి మమత ఈ సందర్భంగా మాట్లాడుతూ హానికరమైన వస్తువులు పిల్లలకు దూరంగా ఉంచడం, వాటి వల్ల కలిగే పర్యవసానాల పట్ల తల్లి తండ్రులు అవగాహన కలిగించాలని,క్లిష్ట తరమైన అత్యవసర చికిత్సలు రాత్రి వేళల్లో కూడా అందుబాటులో ఉన్నాయని ఈ సందర్భంగా డాక్టర్ లోకేష్ ను అభినందించారు.

Comments