మాజీ మంత్రి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనంతో మంత్రి మేకపాటి భేటీమాజీ మంత్రి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనంతో మంత్రి మేకపాటి భేటీజిల్లా పరిస్థితులు, రాజకీయాలపై చర్చ


ఇరువురి కలయికలో కేక్ కట్ చేసి కొత్త సంవత్సరానికి స్వాగతం పలికిన మంత్రి, మాజీమంత్రి


శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా, జనవరి , 04 (ప్రజా అమరావతి) : మాజీ మంత్రి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామ నారాయణరెడ్డిని రాష్ట్ర ఐ.టి, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. మంగళవారం ఉదయం  మంత్రి మేకపాటి నెల్లూరు సంతపేటలోనున్న రామనారాయణరెడ్డి నివాసానికి వెళ్లారు. మంత్రి మేకపాటికి, ఎమ్మెల్యే రామనారాయణరెడ్డి పుష్పగుచ్ఛమిచ్చి,  స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు. ఇరువురు సమావేశమై నెల్లూరు జిల్లాలో ప్రస్తుత పరిస్థితులు, తాజా రాజకీయాలపై చర్చించారు. అనంతరం ఇరువురి కలయికలో కేక్ కట్ చేసి కొత్త సంవత్సరానికి  మంత్రి, మాజీమంత్రి స్వాగతం పలికారు. ఒకరికొకరు తినిపించుకుంటూ ఆనం రామనారాయణ ఛలోక్తుల  మధ్యన ఆనందంగా గడిపారు.