*జిల్లా ప్రజలకు అలర్ట్:*
*ఈనెల 16వ తేదీ వరకూ భారీ వర్షాలు.*
*- ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.*
*-జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్.*
గుంటూరు (ప్రజా అమరావతి);
భారత వాతావరణ శాఖ, న్యూఢిల్లీ వారి హెచ్చరిక మేరకు విశాఖపట్నం తుఫాన్ హెచ్చరిక కేంద్రం ఆదేశాల ప్రకారం గుంటూరు జిల్లాలో రానున్న నాలుగు రోజుల్లో (13.1-2022- 16-1-2022) వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కలెక్టర్ వివేక్ యాదవ్ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. భారీ వర్షాల నేపధ్యంలో జిల్లాలో మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్ళకూడదన్నారు. జిల్లాలోని లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు నీటి ప్రవాహాల వద్దకు పిల్లలను వెళ్లనివ్వకుండా తల్లిదండ్రులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. వాగులు వంకలు ప్రవహించే ప్రదేశాల వద్ద ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ సూచించారు.
addComments
Post a Comment