ఇచ్చిన మాట కోసం ఎంత దూరమైనా వెళ్ళగలిగే వ్యక్తి,

 

ప్రత్తిపాడు, గుంటూరు జిల్లా (ప్రజా అమరావతి);


*వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక – ఇకపై ప్రతి నెలా రూ. 2,500*


*గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించి, పెంచిన పెన్షన్లను లబ్ధిదారులకు అందజేసిన సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌*


*ఈ సందర్భంగా జరిగిన బహిరంగసభలో మాట్లాడిన మంత్రులు, లబ్ధిదారులు ఏమన్నారంటే...వారి మాటల్లోనే*


*మేకతోటి సుచరిత, హోంశాఖ మంత్రి*


ఇచ్చిన మాట కోసం ఎంత దూరమైనా వెళ్ళగలిగే వ్యక్తి,


ఎంతటి కష్టాన్నైనా ఓర్చుకోగలిగే స్ధైర్యం ఉన్న నాయకుడు, మాట ఇస్తే తప్పని మన సీఎంగారు అవ్వాతాతలకు ఇస్తున్న పెన్షన్‌ మొత్తాన్ని మూడు వేల వరకూ పెంచుతానని వాగ్ధానం ఇచ్చి, అధికారం చేపట్టిన తర్వాత మొట్టమొదటి సంతకాన్ని పెన్షన్‌ రూ. 2,250 పెంచుతూ పెట్టారు. ఈ రోజు నూతన ఏడాది కానుకగా రూ. 2,500 చేస్తూ ఈ కార్యక్రమాన్ని మా ప్రత్తిపాడు నియోజకవర్గంలో నిర్వహించిన సీఎంగారికి ధన్యవాదాలు. గతంలో కేవలం 39 లక్షల మందికి రూ. 1000 ఇచ్చారు చంద్రబాబు, కానీ ఈ రోజు మన జగనన్న దాదాపు 62 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నారు. నెలకు రూ. 1,570 కోట్లు పెంచుతూ తీసుకున్న ఈ నిర్ణయం సంక్షేమ పధకాలు పొందుతున్న వారికి వరం. అడగనిదే అమ్మ అయినా అన్నం పెట్టదంటారు, కానీ అడగకుండానే అన్ని వర్గాలకు వారి సమస్యలను అర్ధం చేసుకుని సంక్షేమాన్ని ఇస్తున్నారు. గతంలో సంక్షేమం అంటే కాళ్ళరిగిపోయేలా ఆఫీస్‌ల చుట్టూ తిరగాల్సిన పరిస్ధితి కానీ ఇప్పుడు సంక్షేమమే మన గడప వద్దకు వచ్చి మన తలుపు తట్టి మన ముంగిట నిలుచునే గొప్ప పాలన అందిస్తున్నారు మన సీఎంగారు. వారు చేసిన పాదయాత్రలో ప్రత్తిపాడు నియోజకవర్గంలో ప్రతీ ఒక్కరూ వారి సమస్యలు చెప్పినప్పుడు, ఇప్పుడు వారు ఇస్తున్న సంక్షేమం మనందరి ముగింటికి చేరుతుంది. సముద్ర కెరటాలు అలిసిపోతాయి, మిన్ను విరిగి మీద పడవచ్చు, వెలుగు పంచే సూర్యుడు విశ్రమించవచ్చు, కాళ్ళ క్రింద భూమి బ్రద్దలవ్వచ్చు, వాయువు స్తంభించిపోవచ్చు కానీ కరోనా లాంటి కష్టకాలంలో కూడా మన రాష్ట్రంలో సంక్షేమాన్ని అలిసిపోకుండా మనకు అందించిన ఘనత మన సీఎంగారిది. అన్నా ఈ నియోజకవర్గం జిల్లా కేంద్రానికి కూత వేటు దూరంలో ఉన్నా కూడా అభివృద్దికి ఆమడదూరంలో ఉంది. ఇక్కడున్న అందరూ శ్రమను నమ్ముకున్న రైతు సోదరులు. ఈ రోడ్డు కూడా ఇరుకుగా ఉంది, దానిని డబుల్‌ రోడ్‌ వేసి సెంట్రల్‌ లైటింగ్‌ వేయాలని ఈ ప్రాంత ప్రజల కోరిక, అది మీరు నెరవేరుస్తారని కోరుకుంటున్నాం. ఈ నియోజకవర్గం సాగునీరు, తాగునీరుకు నోచుకోని నియోజకవర్గం, మీ పాలనలో అవన్నీ కూడా మా ప్రజలకు అందాలని మిమ్మల్ని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అన్నా. ఈ నూతన సంవత్సరం ఈ ప్రజలందరి ప్రేమ, ఆప్యాయత, ఆ దేవుని చల్లని దీవెనలతో మీ సంక్షేమం మాకు చిరకాలం ఉండాలని, దేవుడు మిమ్మల్ని చల్లగా ఆశీర్వదించాలని మా తరపున, మా ప్రజల తరపునా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. 


*పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి*


అందరికీ నమస్కారం, నూతన సంవత్సరంలో మొదటి రోజు సీఎంగారు ఇక్కడ మిమ్మల్ని కలవడడానికి రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే వారి అనుమతి లేకుండానే నేను అన్ని సభలలో చెప్పేవాడిని, జనవరి నుంచి నూతన ఏడాదిలో సీఎంగారు వర్చువల్‌ కాన్ఫరెన్స్‌ ఉండదు, తప్పకుండా మన మధ్య ఉండి కార్యక్రమాలు ప్రారంభిస్తారు అని నేను చెప్పిన మాట యాదృచ్చికంగా ఈ రోజు జరగడం చూస్తే ప్రజలంతా సంతోషించాలి. ఎన్నికల ముందు మన నాయకుడు పెన్షన్లు పెంచుకుంటూ పోతామంటే, ఇప్పుడెంత ఇస్తావని మాట్లాడిన ప్రతిపక్షం ఆ రోజు ఏం చేసింది. కేవలం 39 లక్షల మందికి రూ. 1000 ఇస్తే వారిలో మూడు లక్షల మందికి అకౌంట్లలో డబ్బు వేయలేదు, 36 లక్షల మందికి లోపే పెన్షన్లు ఇచ్చారు. పేదరికం కాకుండా పార్టీ సభ్యత్వం చూసి, జన్మభూమి కమిటీ సభ్యులు చెప్పిన వారికే పెన్షన్‌లు ఇచ్చేవారు. మన నాయకుడు మాత్రం ఒకరో ఇద్దరో మిగిలిపోయిన వారికి కూడా సంక్షేమాన్ని అందిస్తున్నారు. అర్హులైతే చాలు సచివాలయంలో దరఖాస్తు చేస్తే చాలు పేదరికమే కొలబద్దగా పధకాలు ఇస్తున్నారు. రాష్ట్రం మొత్తం 62 లక్షల మందికి అంటే కొత్తగా 23 లక్షల మందిని మనం ఎంపిక చేశారు, దాదాపు నెలకు రూ. 1570 కోట్లు ఇస్తున్నాం, అర్హులైతే చాలు పెన్షన్లు ఇస్తున్నాం. పేదలకు పట్టం కట్టిన ప్రభుత్వం ఇది. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ అధికారంలో ఉంది కాబట్టే ప్రజలంతా సంక్షేమ పధకాలు పొందుతున్నారు. మ్యానిఫెస్టోలో చెప్పిన ప్రతీ హమీని అమలుచేసిన ఘనత సీఎంగారిది. మీ అందరి ఆదరాభిమానాలు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీపై ఉండాలని, సీఎంగారిని అందరూ ఆదరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. 


*మోహన్‌రెడ్డి, లబ్ధిదారు, ప్రత్తిపాడు మండలం*


మన జగన్‌ బాబు పాదయాత్రలో అవ్వాతాతలు ఏ మూలన ఉన్నా చేతులెత్తినా వారి దగ్గరకి వెళ్ళి ఓదార్చి నేనున్నాను, మన ప్రభుత్వం రాగానే మీకు రూ. 3 వేల ఫించన్‌ ఇస్తామన్నారు. అవ్వాతాతలు జన్మభూమి కమిటీల వద్దకు వెళ్ళి ఫించన్‌ ఎప్పుడిస్తారు అని అడిగితే మీ ఊళ్ళో ఎవరైనా చనిపోతే రండి ఇస్తామనేవారు, ఇది జగన్‌ బాబుకు పాదయాత్రలో చెప్పగానే మన ప్రభుత్వం రాగానే ఇలాంటి కష్టం ఉండదని మాట ఇచ్చి, వెంటనే తొలి సంతకం పెట్టారు. ఈ రోజున రూ. 2,500 మన చేతికి ఇస్తున్నారు, ఉదయాన్నే వలంటీర్‌ తలుపుతట్టి ఫించన్‌ ఇస్తున్నారు, వృద్దులకే కాదు వివిధ వర్గాలకు ఫించన్‌ ఇస్తున్నారు. బిడ్డలు పట్టించుకోకపోయినా జగన్‌ బాబు అవ్వాతాతలకు ఆయుష్షు పోసి ధన్యుడయ్యారు. ఇలాగే ఎన్నో సంవత్సరాలు తన చేయి మనకు అందించాలి. మసకబారిన ఆరోగ్యశ్రీని సరికొత్తగా తీర్చిదిద్ది మనకు ప్రాణం పోసిన ప్రాణదాత, పాడుబడిన పాఠశాలల రూపుమార్చి విద్యార్ధుల భవిష్యత్‌ తీర్చిదిద్దిన నాయకుడు. ఎవర్‌గ్రీన్‌ యంగ్‌ పొలిటికల్‌ లీడర్‌ మన జగన్‌ బాబు.


*షేక్‌ జమీలా, లబ్ధిదారు, పెదనందిపాడు*


జగన్‌ భయ్యా నూతన సంవత్సర శుభాకాంక్షలు, నేను విడో పెన్షన్‌ రూ. 1000 నుంచి అందుకుంటున్నా, మీరు రాగానే రూ. 2,250 ఇచ్చారు, మీరు నేను విన్నాను, నేను ఉన్నాను అన్నారు. నేను వెయ్యి రూపాయల ఫించన్‌ కోసం వెళితే ఈ రోజు కంప్యూటర్‌ పని చేయడం లేదని, ఈ రోజు వేలిముద్రలు పడటం లేదని ఇలా రకరకాల కారణాలు చెప్పి తిప్పించుకునేవారు. మేం కూలి మానుకుని మరీ తిరిగేవాళ్ళం, మేం పస్తులుండి మరీ తీసుకునే వాళ్ళం, 5 నుంచి 7 రోజులు తిరిగి తీసుకునేవాళ్ళం, కానీ ఇప్పుడు వలంటీర్‌ వచ్చి మా ఇంటి తలుపు తట్టి ఇస్తుంటే ప్రతీ నెలా జగన్‌ అన్న కనిపిస్తున్నారు. నాకు అన్ని పథకాలు అందాయి. నేను నవరత్నాలలో 6 రత్నాలు అందుకున్నాను. పెన్షన్‌ పెంపు, ఆసరా కూడా అందింది, బ్యాంక్‌ లోన్‌ కూడా ధీమాగా తీసుకుంటున్నాను, టిఫిన్‌ సెంటర్‌ పెట్టుకుని నడుపుకుంటున్నాను. చేయూత కింద వచ్చిన డబ్బుతో చీరల వ్యాపారం చేస్తున్నాను. నా మనవడికి రెండు సార్లు అమ్మ ఒడి వచ్చింది. నా మనవడు ఇంగ్లీష్‌లో మాట్లాడుతున్నాడు, నా కోడలికి ఇంటి స్ధలం పట్టా వచ్చింది, నా కొడుకు చదువు ఆగిపోయింది, ఇదే సీఎం అప్పుడు ఉండి ఉంటే నా కొడుకు చదువు ఆగేది కాదు. నా బిడ్డల్లాంటి బిడ్డలు ఎంతోమంది ఇప్పుడు బాగా చదువుకుంటున్నారు, నేను గర్వపడుతున్నా. ఇలాంటి జగనన్న ఎప్పటికీ కావాలి. ఆస్తుల కోసం కడుపున పుట్టిన వారే కొట్టుకుంటుంటే ఏ బంధం లేని మన జగనన్న ఒకేసారి ఖాతాల్లో డబ్బు వేస్తున్నారు. నా భర్త చనిపోయినప్పుడు చంద్రన్న బీమా కూడా రాలేదు, నా బిడ్డ చదువు కూడా ఆగిపోయింది, మా అందరి ఆయుష్షు కూడా పోసుకుని చల్లగా ఉండాలి. నా పుట్టినరోజు ఈ రోజు, నా కల నెరవేరింది, అందరికీ ధన్యవాదాలు.