తిరుపతి నగరపాలక సంస్థ గోల్డ్ కప్

 



 *తిరుపతి నగరపాలక సంస్థ గోల్డ్ కప్* 



 *జాతీయ ఆహ్వాన కబడ్డీ పోటీలు*  


 *హోరా హోరీగా సాగుతున్న లీగ్ పోటీలు*  


 తిరుపతి,జనవరి 06 (ప్రజా అమరావతి);


జాతీయ ఆహ్వాన కబడ్డీ పోటీలలో భాగంగా రెండవ రోజు గురువారం  ఉదయం జరిగిన  లీగ్ పోటీలను  తిరుపతి శాసనసభ్యులు భూమన  కరుణాకర్ రెడ్డి, చంద్రగిరి శాసనసభ్యులు మరియు  తుడా చైర్మన్ డా. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, క్రీడా కారులను పరిచయం చేసుకొని పోటీలను ప్రారంభించారు.


 తిరుపతి  ఇందిరా మైదానంలో జరుగుతున్న జాతీయ మహిళా, పురుషుల ఆహ్వాన కబడ్డీ పోటీలలో భాగంగా  లీగ్ ద్వితీయ రౌండ్ పోటీలలో పాల్గొంటున్న క్రీడాకారులను ఉద్దేశించి తిరుపతి శాసనసభ్యులు  మాట్లాడుతూ పోటీలలో పాల్గొంటున్న క్రీడాకారులకు ఎక్కడా లోటు లేకుండా భోజన  సదుపాయాలు కల్పించామన్నారు. దీనిని దృష్టి లో ఉంచుకొని క్రీడాకారులు మైదానంలో తమ ప్రతిభను చాటుకోవాల్సిన అవసరం ఉందన్నారు.


 చంద్రగిరి శాసనసభ్యులు  మాట్లాడుతూ తిరుపతి నగరంలో గతంలో ఎన్నడు లేని విధంగా జాతీయ ఆహ్వాన కబడ్డీ పోటీలు ఘనంగా నిర్వహించడం ముదావాహం అని   జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు ఏర్పాట్లు అద్భుతంగా చేశారని కొనియాడారు. ఎం ఎల్ ఎ భూమన కరుణాకర రెడ్డి గారి పర్యవేక్షణ లో  అందరి సమిష్టి  కృషితో జాతీయ స్థాయి పోటీలు విజయవంతంగా సాగాలని ఆకాంక్షించారు. తరచూ రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలు నిర్వాహణతో క్రీడాకారులలో దాగిఉన్న ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా నగరపాలక సంస్థ ఆద్వర్యంలో జాతీయ కబడ్డీ ని ప్రోత్సహించడం గర్వించదగ్గ విషయమన్నారు.


 *ఫలితాల వివరాలు* 


 *ఈ పోటీలలో భాగంగా పురుషుల విభాగంలో* : పశ్చిమ బెంగాల్ జట్టుపై కర్నాటక జట్టు 82 – 17 పాయింట్ల తేడాతో  విజయం సాధించింది.  దేశవాళీ కబడ్డీ అకాడమీ కర్నాటక  - హర్యాన  జట్ల మధ్య జరిగిన పోటీ హోరాహోరిగా జరిగింది. మ్యాచ్ ముగిసే సమయానికి దేశవాళీ జట్టు 2 పాయింట్ల ఆదిక్యంతో హర్యాన జట్టు పై నెగ్గింది.  విజయం సాధించి ముందంజ లో కొనసాగుతున్నాయి. ఈ ఎస్ ఐ సి జట్టు 11 పాయింట్ల తేడాతో  వై ఎం సి ఎ ఫరిదాబాద్ జట్టుపై గెలిచింది. నీర్గురియా అకాడమి మహారాష్ట్ర జట్ల మద్య  జరిగిన పోటీ మైదానంలో నువ్వా నేనా అన్న విధంగా జరిగింది. పోటీ ముగిసే సమయానికి ఇరు జట్లు 38 – 38 పాయింట్లతో సమఉజ్జీలుగా నిలవడంతో నిర్వాహాకులు మ్యాచ్ ను టై గా ప్రకటించారు.   పూణే 59 – 33 తేడాతో బీహార్ జట్టు పై , హిమాచల్ ప్రదేశ్ 47 – 27  కోల్ కత్త జట్టుపై , ఎస్ ఎస్ బి జట్టు 50 – 32 స్కోరు తో గోవా పై ఆధిక్యత  సాధించాయి. 


 *మహిళల విభాగంలో*


 హిమాచల్ ప్రదేశ్ 22 పాయింట్ల తేడాతో రాజస్తాన్ పై , హర్యానా 7 పాయింట్ల తేడాతో రుతిక్ జట్టు పై గెలిచాయి. ఈస్టరన్ రైల్వే మహిళల జట్టు ఆరు పాయింట్ల తేడా తో వై ఎం సి ఎ ఫరిదాబాద్ జట్టు పై , మైసూర్ సహకార బ్యాంక్ జట్టు 25 పాయింట్ల తేడాతో కేరళ జట్ట పై ఏకపక్ష పోటీని కొనసాగించింది. పశ్చిమ బెంగాల్ 48 – 14 తేడాతో  బిహార్  పై  ఏకపక్షంగా నెగ్గి తదుపరి రౌండ్ కు అర్హత పొందింది. 

                      

Comments