నైపుణ్య పసిడి పంటలు


                                                                       

 

*నైపుణ్య పసిడి పంటలు*



జాతీయస్థాయి నైపుణ్య పోటీల్లో సత్తా చాటిన ఏపీ బృందం 

17 విభాగాల్లో పోటీ పడి ..9 విభాగాల్లో విజేతలుగా ఎంపిక 

అక్టోబర్ లో చైనాలో జరిగే ప్రపంచస్థాయి నైపుణ్య పోటీలకు అర్హత సాధించిన ఏపీ యువత

బహుమతి, మెమొంటో, పార్టిపేషన్ సర్టిఫికెట్లు అందజేసిన అతిథులు

విజేతలకు ఎపిఎస్‌ఎస్‌డిసి చైర్మన్ కొండూరు అజయ్ రెడ్డి, ఎండీ  బంగారు రాజు అభినందనలు


అమరావతి (ప్రజా అమరావతి):

ఢిల్లీలో ఈనెల 6వ తేదీ నుంచి 10వ తేదీవరకు జరిగిన జాతీయస్థాయి నైపుణ్య పోటీల్లో ఆంధ్రప్రదేశ్ బృందం సత్తా చాటింది. జాతీయస్థాయి నైపుణ్య పోటీల్లో 17 మంది తమ ప్రతిభ చూపారు. మొత్తం 7 బంగారు పతకాలు, 4 రజత, 2 కాంస్య పతకాలు సాధించారు. మరో నలుగురు ప్రత్యేక ప్రతిభ కనబరిచారు. జాతీయ స్థాయి నైపుణ్య పోటీలలో పసిడి పతకాలు సాధించిన 7 మందితోపాటు ఇతర విభాగాల్లో పతకాలు సాధించిన వారు కూడా చైనాలోని షాంఘై నగరంలో నగరంలో ఈఏడాది అక్టోబర్ లో జరగనున్న ప్రపంచస్థాయి నైపుణ్య పోటీలకు హాజరయ్యే అవకాశం ఉంది. జాతీయ స్థాయి నైపుణ్య పోటీలలో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్లిన 30 మందిలో ...  60శాతం మంది పురస్కారాలు అందుకున్నారు. ఢిల్లీలో ఈనెల 6 నుంచి 10వ తేదీ వరకు ఇండియా స్కిల్స్ -2021 పేరుతో జాతీయ స్థాయి నైపుణ్య పోటీలు జరిగాయి. మొత్తం 54 ట్రేడ్స్ లో 26 రాష్ట్రాలతోపాటు పలు కేంద్రపాలిత ప్రాంతాల నుంచి నుంచి 500 మందికి పైగా పోటీదారులు పాల్గొన్నారు. మన రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఎపిఎస్‌ఎస్‌డిసి) ఆధ్వర్యంలో 17 విభాగాల్లో 30 మంది పోటీలకు హాజరయ్యారు. 


ప్రపంచస్థాయి నైపుణ్య పోటీలకు హాజరవనున్న .. ఏడుగురికి ఎపిఎస్‌ఎస్‌డిసి చైర్మన్ కొండూరు అజయ్ రెడ్డి, ఎండి ఎన్ బంగారరాజు అభినందనలు తెలిపారు. వీరంతా 2022 అక్టోబర్ లో చైనాలోని షాంఘై నగరంలో జరిగే అంతర్జాతీయ స్థాయి నైపుణ్య పోటీల్లో పాల్గొంటారని.. జాతీయస్థాయిలో ప్రతిభను ప్రదర్శించి విజేతలుగా నిలిచిన వారిని ప్రపంచస్థాయి నైపుణ్య పోటీలకు తగిన విధంగా అత్యుత్తమ శిక్షణ అందిస్తామని ఛైర్మన్ అజయ్  రెడ్డి స్పష్టం చేశారు. హై ఎండ్ నైపుణ్యాలలో తిరుగులేని శక్తులుగా అవతరించిన యువతని ఎండీ బంగారు రాజు అభినందించారు.

కంప్యూటర్ నైపుణ్యం అంటే ఆంధ్ర ప్రదేశ్ అని నిరూపించారని ప్రతిభ చాటిన అందరినీ మెచ్చుకున్నారు. నైపుణ్య శాఖ సలహాదారు చల్లా మధుసూదన్ రెడ్డి కూడా గెలుపొందిన విజేతలను ప్రత్యేకంగా అభినందించారు.

 

*జాతీయస్థాయి నైపుణ్య పోటీల్లో  విజేతలుగా నిలిచిన విభాగాలు, వివరాలు:* 


*బంగారం*

1. పి. శ్రీమన్ నారాయణ, అడిటేటివ్ మ్యానుఫ్యాక్చురింగ్

2. పి శ్రీకర్ సాయి, క్లౌడ్ కంప్యూటింగ్

3. శ్రీహరి, సైబర్ సెక్యూరిటీ

4. కె ఈశ్వర్ , ఎలక్ట్రానిక్స్

5. లావణ్య సాయి కుమార్, మొబైల్ అప్లికేషన్ డెవలప్‌మెంట్

6. శ్రీనివాస్ , మొబైల్ రోబోటిక్స్

7. పవన్ కుమార్ , మొబైల్ రోబోటిక్స్


*వెండి*:


1. వాణి ప్రియాంక, డిజిటల్ కన్ స్ట్రక్షన్ వర్క్

2. వెంకట రెడ్డి , మొబైల్ అప్లికేషన్ డెవలప్‌మెంట్

3. రవి వంశీ కృష్ణ , రోబోట్ సిస్టమ్ ఇంటిగ్రేషన్

4. జగదీష్ , రోబోట్ సిస్టమ్ ఇంటిగ్రేషన్


*కాంస్యం*:


1. జె. సాయి రిషితశ్రీ, ఐటి సాఫ్ట్ వేర్ సొల్యూషన్స్ ఫర్ బిజినెస్

2. చల్లా శంకర్ , యోగా


*మెడాలియన్ ఆఫ్ ఎక్సలెన్స్*:


1. వై. లహరి,ఐటీ నెట్‌వర్క్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్

2. పి వేణు గోపాల్ రావు, రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండీషనింగ్

3. రవితేజ , రోబోట్ సిస్టమ్ ఇంటిగ్రేషన్

4.జాహ్నవి, రోబోట్ సిస్టమ్ ఇంటిగ్రేషన్



Comments