కొవ్వూరు (ప్రజా అమరావతి);
రాష్ట్ర, దేశ సమగ్రతకు, భద్రత కి పాటుపడాలని, మనవలన తోటివారికి, సమాజానికి గానీ విసమంత , అరవంతు కూడా నష్టం వాటిల్లకూడదని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత పిలుపు నిచ్చారు.
బుధవారం 73 వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా స్థానిక మంత్రి క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండాను మంత్రి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ, రాష్ట్ర, నియోజకవర్గ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దేశ స్వాతంత్ర్యము కోసం ఎందరో ప్రాణత్యాగలు చేస్తే, తదుపరి దేశ రక్షణ కోసం సైనికులు మన దేశాన్ని నిరంతరం రక్షిస్తూ కుటుంబాలకు దూరంగా ఉంటున్నారన్నారు. వారి త్యాగాలను గుర్తెరిగి మన వల్ల దేశానికి ఒక వంతు ఉపయోగం లేకపోయినా పరవాలేదు గాని, అరవంతు కూడా నష్టం వాటిల్లికూడదని పేర్కొన్నారు.
ఈ వేడుకల్లో మునిసిపల్ చైర్ పర్సన్ బావన రత్నకుమారి, జెడ్పిటిసి బొంతా వెంకటలక్ష్మి, కౌన్సిలర్ అక్షయ పాత్ర శ్రీనివాస్ , పలువురు కౌన్సిలర్లు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment