రబీ కి ఈ క్రాప్ నమోదు ప్రారంభించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రత్యేక కార్యదర్శి పూనం మాలకొండయ్య

 రాష్ట్రంలో  తొలుత పశ్చిమ గోదావరిలో 2022 రబీ కి ఈ క్రాప్ నమోదు ప్రారంభించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రత్యేక కార్యదర్శి పూనం మాలకొండయ్యతొలి రైతుగా ఉంగుటూరు మండలం గొల్లపూడి కి చెందిన గొర్రిపాటి ప్రభాకరరావు ఇ పంట నమోదు


 ఏలూరు/ఉంగుటూరు, జనవరి 5 (ప్రజా అమరావతి):

రైతులకు భరోసాగా నిలిచేందుకు ప్రస్తుత రబీ సీజన్ కు  అవసరమైన ఈ క్రాప్ నమోదు ప్రారంభంచడం జరిగిందని రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య పేర్కొన్నారు.


బుధవారం పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు మండలం గొల్లపూడి గ్రామంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సమక్షంలో  ప్రస్తుత రబీ సీజన్ కోసం ఈ క్రాప్ నమోదు కు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య మాట్లాడుతూ, రాష్ట్రంలోని రైతులు పంట పండించే ప్రతి ఎకరాకు భద్రత, భరోసా కల్పించాలనే లక్ష్యంతో ఈ క్రాప్ ప్రక్రియ ను ప్రారంభించడం జరుగుతోందన్నారు. రాష్ట్రంలో నే  2022 రబీ సాగుకు సంబంధించిన ప్రక్రియ కు పశ్చిమగోదావరి జిల్లాలో శ్రీకారం చుట్టమని ఆమె తెలిపారు. ఈక్రాప్ నమోదు వల్ల రైతులు వారు సాగు చేసే పంటలకు గిట్టుబాటు ధర లభించడం, నుంచి ప్రభుత్వ పరంగా అందచేసే ప్రతి ఒక్క ప్రయోజనాన్ని పొందగలుగుతారని పూనం మాలకొండయ్య తెలిపారు. ఈక్రాప్ నమోదు వల్ల వ్యవసాయ అధికారులు ప్రతి అడుగులోను పంట వేసే సమయం లో  సూచనలు, సలహాలు అందించడం జరుగుతుందని పేర్కొన్నారు. అదేవిధంగా ఈ క్రాప్ వలన  తో పాటు ప్రకృతి విపత్తుల వల్ల ఏర్పడిన పంట నష్టం,  భీమా పరిహారం అందించే అంశాల్లో అండగా నిలిచేందుకు ఈ క్రాప్ తప్పనిసరి గా చేసుకోవాలని కోరారు. రాష్ట్రంలో రైతులు పండించే ప్రతి ఎకరా కూడా ఈ క్రాప్ లో నమోదు కు రైతులు స్వచ్ఛందంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. 

పశ్చిమగోదావరి జిల్లా చేబ్రోలు .. గొల్లపూడి గ్రామానికి చెందిన రైతు గొర్రిపాటి ప్రభాకరరావు తొలి ఈ క్రాప్ నమోదు చేసుకున్న రైతు గా నిలిచారన్నారు. వ్యవసాయ అధికారులు సూచనలు మేరకు ఎమ్.టి.యు.1121 రకం వరివంగడం వెయ్యడం జరిగిందని, మొత్తం ఆరు ఎకరాల్లో ఆయన సాగు విస్తీర్ణం చేసుకుంటున్నారని అధికారులు తెలిపారు.

రైతులు సాగుచేసిన పంటలను ఈక్రాప్‌ బుకింగ్‌లో నమోదు చేయడం వల్ల ప్రభుత్వం అందించే ఎన్నో పథకాలు లబ్ధిచేకూరుతాయన్నారు.  ఏపంట సాగుచేస్తే ఆపంట మాత్రమే క్రాప్‌బుకింగ్‌ చేయాలని, తప్పని సరిగా రైతుల పొలాల్లోకి వెళ్లి నమోదు చేయాలనీ క్షేత్రస్థాయి సిబ్బందికి సూచనలు చేశారు. ఈ పర్యటన లో స్పెషల్ సీఎస్ వెంట రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ఎండి జి. వీరపాండ్యన్, జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా, జేసి డా.బీఆర్ అంబేద్కర్, ఆర్డీవో పి. రచన, జెడి (అగ్రి) జగ్గారావు, డీఎస్వో ఎన్. సుబ్బరాజు, సివిల్ సప్లైస్ డియం దాసిరాజు ఇతర అధికారులు పాల్గొన్నారు.Comments